విప్లవోద్యమంలో అమరులు ప్రజల గుండెల్లో సదా వెలుగొందుతూనే ఉంటారు

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
పీడిత ప్రజల విముక్తికి కోసం పోరాడిన అమరులైన వీరులు ప్రజల గుండెల్లో సదా  ఎలుగొందుతూనే ఉంటారని కామ్రేడ్ ఏనుగుల మోహనన్న నిత్యం చిరంజీవిగా ఉంటాడని, ప్రజా పోరాటాలలో రగిలే ఎర్రజండాలై రెపరెప లాడుతారని సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి, భువనగిరి డివిజన్ కార్యదర్శి లు ఆర్.జనార్ధన్, బేజాడి కుమార్ అన్నారు. శుక్రవారం, యాదగిరిగుట్ట కమతంగూడెం, కామ్రేడ్ ఏనుగుల మోహనన్న 9 వ వర్ధంతి సభ జరిగినది. కామ్రేడ్ మోహనన్న స్మారక స్తూపం వద్ద జెండాను సిపిఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి, ఆర్. జనార్దన్ ఎగురవేశారు. కామ్రేడ్ మోహనన్న చిత్రపటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు సంతాప సూచకంగా మౌనం పాటించి ఘనంగా విప్లవ జోహార్లు తెలియజేశారు. సభకు సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ యాదగిరిగుట్ట సబ్ డివిజన్ నాయకులు కామ్రేడ్ ఏనుగుల ఉదయ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జనార్ధన్, బేజాడి కుమార్ మాట్లాడుతూ కామ్రేడ్ మోహనన్న కష్టజీవిగా పుట్టి కాయ కష్టం చేసి, అసమానతలతో, వివక్షతకు గురవుతూ, దోపిడీ, పీడనలకు నిత్యం గురిచేస్తూ ప్రజా జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్న అసమానం తో కూడుకున్న సమాజాన్ని సమానత్వ సమాజంగా మార్చడానికి కామ్రేడ్ మోహనన్న విప్లవ కమ్యూనిస్టుగా మారాడని ప్రజలను మక్కువచేసుకొని ప్రజల్లో కలిసిపోయాడని కొనియాడారు.
మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో మూడువందల యాభై, నాలుగు వందలు సీట్లు వస్తాయని బీ జే పీ ఎంత ఢంకా బజాయించుకున్నప్పటికీ స్వంతంగా అధికారాన్ని చేపట్టే విధంగా కూడా సీట్లు రాక సాతికీలపడిపోయిందని, చివరికి అయోధ్యను గొప్పగా చెప్పుకుంటున్న బీ జే పీ ఆ ప్రాంత పార్లమెంటు సీటును కోల్పోయిందని, వారణాసిలో మోడీకి మెజారిటీ తగ్గిందని అన్నారు. మోడీ సంకీర్ణ ప్రభుత్వం అధికారం చేపట్టగానే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను అమలు చేస్తామని బరితెగించి ప్రకటించిందని, వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేయపునుకున్నదని ఆరోపించారు. రైతులకు ఈ వ్యవసాయ సీజన్ లో అన్ని విధాలుగా ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అన్నీ కూడా ఉచితంగానే సరఫరా చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరునెలలు దాటుతున్నప్పటికి ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యంగా కార్మికుల వాగ్దానాలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కామ్రేడ్ ఏనుగుల మోహనన్న జీవిత సహచరి ఏనుగుల నర్సక్క కూతుళ్లు జీవనజ్యోతి, ఉమా, సీపీఐ జిల్లా నాయకులు కొల్లూరి రాజయ్య, కమటం గూడెం మాజీ సర్పంచ్ కమటం శ్రీరాములు, జిల్లా నాయకులు చీర బోయిన రాజయ్య, బర్మ బాబు, చిర బోయినకొమురయ్య, ఆర్ సీత, పద్మ సుదర్శన్, ఒగ్గు మల్లయ్య, కర్రే పాండరి, పాకాల నరేష్, తమ్మడి అంజయ్య, ఆర్.ఉదయ్, ఏనుగుల ఎల్లయ్య, పుప్పాల సిద్ధులు, వఇంజ శ్రీనివాస్, తాడెం పాండు, పి రాఘవరెడ్డి, ఇక్కిరి కుమార్, తమ్మడి రమేష్, తమ్మడి మాధవి, తమ్మడి ఉమా, పాకాల సరిత, పద్మ శశిరేఖ, గడ్డం యాదగిరి, పగడాల శివ, కొమ్మిడి గోపాల్ రెడ్డి, గోవిందు పరమేష్, కొమ్మిడి శ్రీకాంత్ రెడ్డి, పుండరీకం, సుంకే బాలయ్య, సుంచు రాములు, చిన్నం సత్యనారాయణ, సహదేవులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love