శివాలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్న బీర్ల ఐలయ్య దంపతులు

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
ఉగాది పండుగను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే  బీర్ల ఐలయ్య కుటుంబ సభ్యులతో కలసి మంగళవారం, యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురం వీరభద్ర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, అభిషేకంలో పాల్గొన్నారు. అనంతరం నూతన పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. ఉగాది పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ భగవంతుని ఆశీర్వాదం ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు.
Spread the love