యాదగిరిగుట్టకు పునర్ వైభవం తీసుకొస్తాం

– స్వామివారికి, భక్తులకు సేవ చేద్దాం
– ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
– వ్యాపార సముదాయ పత్రాలు అందజేత
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్టకు పునర్ వైభవం తీసుకొస్తాం అని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. యాదగిరిగుట్ట పట్టణం రెడ్డి సత్రంలో యదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి లో షాపులు కోల్పోయిన బాధితులకు న్యూ బస్టాండ్ వద్ద నిర్మంచిన షాపులకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య  లబ్ధిదారులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల నుండి లబ్ధిదారులకు గుండం దగ్గర షాపులు కేటాయించినకానీ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో గత రెండు నెలల కింద నన్ను సంప్రదించారన్నారు. కచ్చితంగా షాపులు కోల్పోయిన వాళ్ళందరికీ షాపులు ఇస్తా అని మాట ఇచ్చి ఈరోజు 139 మందికి షాపులు అలాట్ చేసాము అన్నారు. ఇంకా మిగిలిన వారికి షాపులను 15, 20 రోజులలోనే పునరుద్ధరించి అన్ని షాపులు నడిచే విధంగా కార్యచరణ చేస్తామన్నారు. ఇంకా కొంతమందికి షాపులు రాలేదు వారి సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి సంబంధిత ఆర్డీవో, కలెక్టర్ తో మాట్లాడి వాళ్లకు కూడా షాపులు ఇస్తామని మాట ఇస్తున్నామని తెలిపారు. ఆలయ అభివృద్ధి లో షాపులు కోల్పోయిన వారికి పత్రాలు ఇవ్వటం శుభపరిణామం అన్నారు. మిగిలిన వారికి తొందర్లనే పత్రాలు ఇస్తామన్నారు. షాపుల్లో మిగిలిన సౌకర్యలు ఏర్పాటు చేసి షాపులు ప్రారంభం చేసుకుందామన్నారు. లక్ష్మీ నరసింహ స్వామికి, లక్ష్మీ నరసింహ సేవకు వచ్చే భక్తులకు సేవ చేద్దాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుధా మహేందర్ గౌడ్, జడ్పిటిసి తోటకూర బీరయ్య, కౌన్సిలర్లు ముక్కెర్ల మల్లేష్ యాదవ్, గౌలికర్ అరుణ, తాళ్లపల్లి నాగరాజు, భరత్ గౌడ్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు పేరబోయిన పెంటయ్య, బాబా, బందారపు బిక్షపతి గౌడ్, బూడిద భాస్కర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love