తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు

నవతెలంగాణ – తాడ్వాయి
మండలంలోని కాటాపూర్ లో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు పులి నరసయ్య గౌడ్ ఆధ్వర్యంలో గౌడ కులస్తులు ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహించారు. ఉదయమే లేచి తలంటు స్థానాల ఆచరించి, ఇండ్లను శుభ్రపరచి మామిడి తోరణాలతో ఉగాది పచ్చడి తయారు చేసి, 5తీరుల పప్పు దినుసులతో గుడాలు వేసి, ఎల్లమ్మకు, బోనాలను నిర్వహించి కంఠమహేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ కలుగీత కార్మిక సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు పులి నరసయ్య గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు పాలకుర్తి రవీందర్ గౌడ్, పులి రవి గౌడ్ ల ఆధ్వర్యంలో తాటి వనంలో ఉన్న ఎల్లమ్మ కంఠమహేశ్వరుడు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాత సంవత్సరం శోభకృత్ సంవత్సరానికి స్వస్తి చెప్పి కోరు నామ సంవత్సరంలోకి అడుగు పెట్టడం, ఈ సంవత్సరంలో ప్రజలందరూ ప్రతి ఒక్కరు ఇసుక సౌభాగ్యాలతో ఐరారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్తాదార్ గడ్డం శ్రీధర్, కళ్ళు గీత కార్మిక సంఘం నాయకులు గుండు సదయ్య, గడ్డం రామయ్య పాలకుర్తి జగ్గయ్య బెల్లంకొండ నాగేష్, పాలకుర్తి బాబు, కలుగీత కార్మిక సంఘం నాయకులు మహిళలు, తదితరు లు పాల్గొన్నారు.
Spread the love