కలెక్టర్ కు ఉగాది శుభాకాంక్షలు : టిఎన్జీవోస్

నవతెలంగాణ – తాడ్వాయి 
ములుగు జిల్లా టీఎన్జీవోస్ యూనియన్  అధ్యక్షులు పోలురాజు గారి ఆధ్వర్యంలో, జిల్లా కార్యదర్శి మేడి చైతన్య వైస్ ప్రెసిడెంట్ రమాదేవి, కుమారస్వామి, యూనియన్ సభ్యులందరూ సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి గారిని కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త సంవత్సరాది తెలుగు సంవత్సరాది సందర్భంగా జిల్లా ప్రజలందరూ చల్లగా కలకాలం క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీయూస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love