ఏజెన్సీలో సీతక్క సేవలు అభినందనీయం

– బీరెల్లి మాజీ సర్పంచ్, జిల్లా నాయకులు బెజ్జూరి శ్రీనివాస్
– మంత్రి సీతక్కకు ఉగాది శుభాకాంక్షలు
నవతెలంగాణ – తాడ్వాయి
పేద బడుగు బలహీన వర్గాల అణగారిన వర్గాల ప్రజలకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క సేవలు అభినందినీయమని, బీరెల్లి మాజీ సర్పంచ్, ములుగు జిల్లా కాంగ్రెస్ నాయకులు బెజ్జూరి శ్రీనివాస్ అన్నారు. సోమవారం నవతెలంగాణ తో మాట్లాడుతూ మొదట మంత్రి సీతక్కకు బీరెల్లి గ్రామ ప్రజలందరి, ములుగు జిల్లా ప్రజలందరి తరపున ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ నవతెలంగాణతో మాట్లాడుతూ అణగారిన ప్రజలు చైతన్యం కోసం రాజకీయాల్లో చేరడానికి ముందు 15 ఏళ్లుగా నక్సలైట్ గా అజ్ఞాతవాసం గడిపిన మాజీ నక్సలైట్ నాయకురాలు ధనసరి అనసూయ అలియాస్ సీతక్క అని అన్నారు. మారు 15 ఏళ్ల పాటు నక్సలైట్ ఉద్యమంలో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేశారని, అనంతరం రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా మంత్రిగా అంచలంచలుగా ఎదిగారని కొనియాడారు. మంత్రి సీతక్క బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం సేవ చేయాలని రాష్ట్ర, దేశ స్థాయిలోనే ఆమె రాజకీయాల్లో అందిపించుకోవాలని కోరారు. కరోనా సమయంలో ఆమె సేవలు అభినందనీయమని కొనియాడారు. ఆమె విశేష సేవలు దేశస్థాయిలో అవసరమని తెలిపారు.
Spread the love