కాటాపూర్ పి హెచ్ సి సమస్యలు పరిష్కరించండి

– సిపిఎం మండల కార్యదర్శి దుగ్గీ చిరంజీవి
– కాటాపూర్ పీహెచ్సీ సందర్శించిన దుగ్గీ
నవతెలంగాణ -తాడ్వాయి
మండలంలోని కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పిహెచ్సి) సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం మండల కార్యదర్శి, గిరిజన సంఘం రాష్ట్ర నాయకుడు దిగి చిరంజీవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనకి నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రంజిత్ మాట్లాడారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంచినీటి సౌకర్యం ప్రధాన సమస్యగా ఏర్పడిందని అన్నారు. వైద్యులు, సిబ్బంది, పేషెంట్లు మంచినీటికి నాన్న ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో వేసిన మంచినీటి బోరు ఖరాబ్ అయిందని ఇప్పటివరకు పట్టించుకున్న నాధుడే కరువయ్యాడని మండిపడ్డారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రహరీ గోడ కూడా నిర్మించాలని తెలిపారు. 8 గ్రామపంచాయతీలకు వరప్రదాయనిగా ఉన్న కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారులు పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు. ప్రాథమిక కేంద్రానికి వచ్చిన రోగులు, వైద్యులు వైద్య సిబ్బంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నీటి సౌకర్యం లేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన చెందారు. జిల్లా కలెక్టర్, ఐ టి డి ఏ, ప్రాజెక్టు అధికారి (పి ఓ) కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సమస్యలు క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే సమస్యల పరిష్కరించాలని వారు కోరారు.

Spread the love