రంగాపూర్లో ఉగాది నాడు చలివేంద్రం ఏర్పాటు

నవతెలంగాణ – తాడ్వాయి
మండలంలోని రంగాపూర్ గ్రామంలో  ఇర్పా వారి ఇలవేల్పు చిన్న సూర గుండయ్య వారి ఆధ్వర్యంలో మంగళవారం క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ పర్వదినాన చలివేంద్రం ఏర్పాటు చేశారు. చలివేంద్రం వ్యవస్థాపకులు ఇర్ప వంశస్థులు, రంగాపూర్ మాజీ సర్పంచ్ ఇర్ప అశ్విని సూర్యనారాయణ, ఎస్ఆర్పి, కొండపర్తి ఉపాధ్యాయులు ఇర్ప నాగేశ్వరరావు లు మాట్లాడుతూ ప్రయాణికుల,  బాటసారుల దాహార్తి తీర్చేందుకు కొత్త కొండలలో మంచినీటి కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలకు ఎక్కువగా దాహం వేసే వేసవికాలంలో కాబట్టి, వివిధ పనుల నిమిత్తం వచ్చే ఇతర గ్రామస్తులకు, ముఖ్యంగా పేదవారికి ఈ చలివేంద్రాలు ఎంతో ఉపకరిస్తాయని అన్నారు. ఎండలో ప్రయాణించి బాటసారిలు వివిధ పనులపై వెళ్లే వారు చలివేంద్రాలను ఉపయోగించుకొని దాహార్తిని తీర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగాపూర్ గ్రామ పెద్దలు ఇర్ప ఎర్రయ్య, సత్యం, యూత్ నాయకులు ఇరుప విష్ణు, శివకుమార్ దశరథం బాడ్స సత్యనారాయణ ఇర్ప రవి కుమార్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love