నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పల్లెలలో పెద్గ పీర్ల ఉత్సవాలను బుధవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి గ్రామాలలో దూద్ పీర్ ను తయారు చేసి గ్రామ పురవిధులలో బాజాభజంత్రిలతో ఉరేగింపుగా తీసుకెళ్లి గ్రామములోని ముఖ్యమైన ఖాళీ ప్రదేశంలో ప్రజల దర్శనం కొరకు పెట్టి మజీను నృత్యం చేసారు. మద్యమద్యలో వినోద ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఇది పూర్వం నుండి వస్తోన్న ఆనవాయితీ. సాయంత్రం దూద్ పీరును చెరవు లేదా నీటీ వసతి ఉన్న ప్రదేశంలో తీసుకెళ్లి వదిలేస్తారు. ఇలా ఐదురోజుల క్రితం ప్రారంభమైన పీర్ల ఉత్సవాలు నేటీతో ముగుస్తోంది.