ఘనంగా ఐఎన్ టీయూసీ ఆవిర్భావ దినోత్సవం 

నవతెలంగాణ – రామగిరి  
సింగరేణి ఆర్ జి-3  ఏరియాలోని ఓసిపి-2 లో ఫిట్ సెక్రటరీ రామిండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఐ ఎన్ టి యు సి 77వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ, సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, ఏరియా ఉపాధ్యక్షుడు కోటా రవీందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సహకారంతో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో  బేస్ వర్క్ షాప్  ఫిట్ సెక్రటరీ కె ఎన్.చారి, పి శివానంద రావు,డి మంగయ్య, ఎస్ బుచ్చయ్య, తాటికొండ మొగిలి, బుద్ధ సదానందం, శ్రీనివాస చారి, ఉయ్యాల కుమారస్వామి,ఎస్ వెంకన్న, సుగేందర్, అబ్దుల్ ఖాసిం, రంజాబీ, తదితరులు పాల్గొన్నారు.
Spread the love