హైదరాబాద్: ప్రముఖ షట్లర్ జ్వాల గుత్తా తన బ్యాడ్మింటన అకాడమీని విస్తరించింది. సోమవారం మొయినాబాద్‌లోని సుజాత స్కూల్లో జ్వాల గుత్తా మహిళల క్రికెట్ అకాడమీని ఆమె ప్రారంభించింది. ఈ సందర్భంగా జ్వాల మాట్లాడుతూ దేశంలో క్రికెట్‌కు మంచి ఆదరణ ఉందని, అయితే, మహిళా క్రికెటర్లకు ప్రత్యేకంగా అకాడమీలు చాలా అరుదుగా ఉన్నాయని చెప్పింది. బాలికలు, మహిళా క్రికెటర్లకు ప్రొఫెషనల్ కోచింగ్ అందించాలనే ఉద్దేశంతో ఉమెన్స క్రికెట్ అకాడమీ ప్రారంభించినట్టు తెలిపింది. అకాడమీలో తక్కువ మందికే అడ్మిషన్స ఇస్తున్నామని, హాస్టల్ సదుపాయం కూడా ఉందని చెప్పింది. ఈ కార్యక్రమంలో సుజాత స్కూల్ డైరెక్టర్ ఉదరు సింగ్, జ్వాల గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్స్లెన్స డైరెక్టర్ క్రాంతి పాల్గొన్నారు.