టీచర్స్ కాలనీ కమాన్ ప్రారంభోత్సవం..

నవతెలంగాణ – ఆర్మూర్  

మున్సిపల్ పట్టణ కేంద్రంలోని టీచర్స్ కాలనీలో గల హనుమాన్ దేవాలయంలో వీర హనుమాన్ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాలనీవాసులు చందాలు నిర్వహించి టీచర్స్ కాలనీ ముఖ ద్వారం కమాన్ నిర్మాణం చేపట్టారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా సీనియర్ సిటిజన్స్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ రవికుమార్, హాజరయ్యారు. కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ కే.రామ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జితేందర్ రెడ్డి, రంగాచారి, సురేందర్ రెడ్డి, అలాగే కాలనీ కమిటీ సభ్యులు, గౌరవ అధ్యక్షులు బిజ్జు దత్తాద్రి, కాలనీ అధ్యక్షులు కొంతం మురళీధర్, వైస్ ప్రెసిడెంట్ ధనుంజయ రెడ్డి, క్యాషియర్ సురేందర్ రెడ్డి, సెక్రెటరీ దున్నాల రామా గౌడ్, కమిటీ సభ్యులు విజయానంద్, కమల్, రణధీర్, మార్గదర్శి గంగాధర్, గట్టడి సునీల్, బొడ్డు సాగర్, బండి రాజు, సతీష్, సాయికుమార్, కొంతం పూర్ణచందర్,  కొంతం ఆనంద కుమార్, సంతోష్, బిజ్జు మహేందర్, దేవరాజు, కాలనీ మహిళా మణులు, కాలనీవాసులు పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు కొంతం మురళీధర్ మాట్లాడుతూ మా కాలనీ ఎంట్రెన్స్ ముఖద్వారానికి ప్రత్యక్షంగాను పరోక్షంగానూ సహకరించిన వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు.

Spread the love