పెంచిన వంటగ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే ఉపసరించుకోవాలి

– ప్రజలపై పెట్రోల్ డీజిల్ గ్యాస్ భారమా..?
– సిఐటియు జిల్లా కార్యదర్శినూర్జహాన్ 
నవతెలంగాణ కంఠేశ్వర్ 
ప్రజలపై పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు భారం అవుతున్నాయని, పెంచిన వంట గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సిఐటియు ఆధ్వర్యంలో ఆటోలకు తాడు కట్టే లాగుతూ నిరసన తెలిపారు.ఈ సందర్భంగా సిఐటియు కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ..కేంద్ర బిజెపి ప్రభుత్వం పెంచిన గ్యాస్ పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ బస్టాండ్ వద్ద ఆటోకు తాడు కట్టి చౌరస్తాలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. కేంద్రంలో ఉన్న బిజెపి గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజలపై పెనుభారం మోపిందని అన్నారు. ఇప్పుడు పెరిగిన గ్యాస్ ధరల ఫలితం గా ఒక తెలంగాణ రాష్ట్రం పై 400 కోట్ల భారం పడుతుందనీ అన్నారు. ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుతుంటే కూడా ఈ దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం దారుణమని అన్నారు.మహిళలపై గ్యాస్ భారం ఎల్పిజి గ్యాస్ సిలిండర్పై రూ.50 పెంపు సామాన్యుల నెత్తిన భారాలు.. మోడీ-బీజేపీ రాజనీతి2014తో పోలిస్తే ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో బ్యారాల్ ముడి చమురు ధర చాలా తగ్గిందని అన్నారు. మోడీ ప్రభుత్వ నాటకాలను ప్రజలు గమనించాలని కోరారు. గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను అదుపు చేయకుంటే పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కటోరీ రాములు కృష్ణ , ముజీబ్, కిషన్ ,పరశురాం సురేందర్ ,సాయిలు ,సయ్యద్ రఫీ ఉద్దీన్ ,అశ్వక్ ,అస్లాం తదితరులు పాల్గొన్నారు
Spread the love