హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎగుమతుల కంటైనర్లు ప్రారంభం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చింది. దీనికి సంబంధించి బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను సనత్‌నగర్‌లోని ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపో(ఐసీడీ) వద్ద తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ కృష్ణ ఆదిత్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్-యూకే ఆర్థిక సంబంధాల్లో ఈ ఒప్పందంతో భారతీయ ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలను మెరుగుపరుస్తుందని చెప్పారు. ఉత్పత్తులపై పన్నులు తగ్గడం వల్ల తెలంగాణ నుంచి జరిగే ఎగుమతుల పోటీతత్వం పెరుగుతుందన్నారు. విదేశీ వాణిజ్య విభాగం హైదరాబాద్ అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ సంపత్ కుమార్, విశాఖపట్నం సెజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీమతి భవానీశ్రీ, అపెడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ అధిపతి ఆర్పీ నాయుడు, యూకే హైకమిషన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ హెడ్ సిద్ధార్థ్ విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి యూకేకు సుమారు 402.5 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగా యని ఈ సందర్భంగా వారు తెలిపారు. ప్రధాన ఎగుమతి వస్తువుల్లో ఫార్మా స్యూటికల్స్, బయోలాజికల్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రికల్ యంత్రాలు, రసాయనాలు, ఇంజనీరింగ్ వస్తువులు, వైద్య పరికరాలు ఉన్నాయి.
రాష్ర్టంలో పలుచోట్ల…
ఈ ఒప్పందం అమలులోకి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని నిజామాబాద్‌లో కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి, అపెడా, స్పైసెస్ బోర్డు అధికారుల సమక్షంలో బియ్యం ఎగుమతి కంటైనర్‌ను జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్‌లోని హయత్‌నగర్ దగ్గర విదేశీ వాణిజ్య విభాగం జాయింట్ డైరెక్టర్ జనరల్ శంభాజీ చవాన్, అపెడా అధికారులతో కలిసి ఫ్యూమర్ అగ్రి ఫుడ్స్ ప్రయివేట్ లిమిటెడ్ ఎగుమతి చేసిన ఆహార ఉత్పత్తుల కంటైనర్‌ను ప్రారంభించారు.
అమలులోకి భారత్-యూకే వాణిజ్య ఒప్పందం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



