ఇండియా వేదిక, కాంగ్రెస్‌ పోకడలు

ఇండియా వేదిక, కాంగ్రెస్‌ పోకడలుఇండియా వేదికలో పెద్ద పురోగమనం లేదని బీహార్‌ ముఖ్యమంత్రి, జేడీయు నాయకుడు నితీశ్‌ కుమార్‌ వ్యాఖ్యానించడం యాదృచ్చిక మేమీ కాదు. దేశ రాజకీయాలలోనూ భిన్న కూటములలోనూ ఆరితేరిన నితీశ్‌ పాట్నా లోనే ఈ వేదిక అంకురార్పణకు చొరవ చూపించారు. దేశంలో ప్రధాని అభ్యర్థుల్లో ఆయన ఒకరని ప్రచారం జరిగినా దానిపై స్పందించకుండా రాజకీయాలు నడిపిస్తు న్నారు. సీపీఐ ఆధ్వర్యంలో పాట్నాలో జరి గిన ‘బీజేపీ హఠావో-దేశ్‌ బచావో’ ర్యాలీలో పాల్గొంటూ ఆయన ఈ మాట అనడం కూడా గమనించదగ్గ విషయం. కాంగ్రెస్‌ పార్టీ అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలపైనే ఎక్కువ ఆసక్తి కలిగివున్నట్టు కనిపిస్తుందని కూడా ఆయనన్నారు. నితీశ్‌ ప్రకటనపై వ్యాఖ్యానిస్తూ షరా మామూలుగా బీజేపీ తనకు అలవాటైన భాషలో ఇండియా వేదిక ఒక తుక్డే తుక్డే గ్యాంగ్‌ అని అవ హేళన చేసింది. నితీశ్‌ మాటలకు తగినట్టే కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ శాసనసభ ఎన్నికల కారణంగా అందులో మునిగి పోయామని అవి పూర్తవగానే మళ్లీ ‘ఇండియా’పై దృష్టి పెంచు దామని చెప్పారట. విశేషమేమంటే బీజేపీ మతత త్వంపై పోరాటంలో అయిదు రాష్ట్రాల ఎన్నికలు కూడా కీలకమైనవి. భాగస్వామ్య పార్టీలన్నీ కలిసి దాన్ని ఎదుర్కొవలసి వుండగా అలాంటిదేమీ జరగ లేదు. ఖర్గే ఆ సంగతి ప్రస్తావించకుండా ఎన్ని కలు ముగిశాక కార్యక్రమాలు పెంచుదామని చెబుతు న్నారు. కాంగ్రెస్‌ నాయకత్వం ఆలోచనాధోరణి ఇక్క డే తెలుస్తుంది. ఉదాహరణకు మధ్యప్రదేశ్‌ వంటి చోట్ల ఆ పార్టీతో సర్దుబాట్లు చేసుకోవడం కోసం సమాజ్‌వాదిపార్టీ, జేడీయు వామపక్షాలు ప్రయత్నిం చాయి. కాని ఫలించలేదు. అఖిలేశ్‌ యాదవ్‌ దీనిపై తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు, నితీశ్‌ కూడా విఫల యత్నం చేశారు. అక్కడ ఉమ్మడిగా సభ జరపాలనే ఆలోచనకు కూడా మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ విముఖత వ్యక్తం చేశారు. ఇందుకోసం ఏర్పాటైన సమన్వయ కమిటీలకు ప్రతినిధిని కూడా పంపించ డానికి నిరాకరించారు. నాగపూర్‌లో జరగాల్సిన సభ కూడా ఇదే విధంగా వెనక్కుపోయింది. రాష్ట్రాలలో ఒద్దిక కష్టం గనక 2024 ఎన్నికలపై కేంద్రీకరిం చడం మంచిదని ఎన్‌సిపి నేత శరద్‌పవార్‌ సూటి గానే చెప్పారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా ఈ ఎన్ని కల్లో కలసి పోటీ చేసివుంటే బావుండేదని స్పష్టం చేశారు. అది సాధ్యం కాలేదు గనకే రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణలలో సీపీఐ(ఎం) విడిగానే రంగంలోకి దిగుతున్నది. సమాజ్‌వాదిపార్టీ కూడా యూపీలోని 85 లోక్‌సభ స్థానాల్లో తాను 65 చేస్తాననీ, భాగ స్వామ్య పార్టీలకు పదిహేను కేటాయిస్తానని సూచ నగా చెప్పింది. నితీశ్‌ మాట్లాడుతూ అందరం కలిసి పనిచేయాలని ఆశించామని అయితే కాంగ్రెస్‌ అనా సక్తి ఇందుకు ఆటంకమైందని స్పష్టం చేశారు. ఆ పార్టీ తన ఎన్నికల అవకాశాలపైనే దృష్టి పెట్టడం వల్లనే పాట్నా సమావేశం తర్వాత ఇండి యాపనిలో పురోగమనం లోపించిందని తెలిపారు.
ఖర్గే దాటవేతలు
మల్లికార్జున ఖర్గే దీనిపై మాట్లాడకపోగా బీజేపీపౖౖె పోరాటానికి ‘ఇండియా’ కీలకమనీ, లోక్‌ సభ ఎన్నికలలో ఇండియాను ముందుకు తీసుకు పోవడానికి తాము కట్టుబడి వున్నామని పవార్‌ తరహాలోనే జవాబిచ్చారు. శాసనసభ ఎన్నికల్లో తాము బీజేపీని ముఖాముఖి ఢ కొడుతున్నందున దృష్టి అటు మళ్లించామని సమర్థించుకున్నారు. తాము ప్రధాన శక్తిగా వున్న చోట ఇతరులను కలుపు కుపోవలసిన బాధ్యత కాంగ్రెస్‌ నిర్వహించవలసిన అవసరం వుంటుంది. అదే జరగడం లేదని ఖర్గే మాటలే స్పష్టం చేస్తున్నాయి. ఇదే సమయంలో ఆమ్‌ ఆద్మీ పార్టీతో పంజాబ్‌ కాంగ్రెస్‌ సంబంధాలు మరింత దిగజారాయి. ఈ అయిదు రాష్ట్రాలలోనూ తను అనుకున్న విధంగానే పోటీ లు నిర్ణయించు కోవడం తప్ప ఎలాంటి సమన్వయానికి ప్రయ త్నించిన దాఖలాలు లేవు. అసలు కాంగ్రెస్‌లోనే పూర్తి ఏకాభిప్రా యం వున్నట్టు కనిపించదు. లౌకికపార్టీలను కలుపుకుని పోవా లని రాహుల్‌ గాంధీ వంటివారు సూచించినా రాష్ట్రాలలో నాయ కులు ఒప్పుకోలేదని ‘హిందూ’ సంపాదకీయంలో వెల్లడించింది. భాగస్వామ్యపార్టీల నేతల వ్యక్తిగత పోకడలు ఐక్య తకు ఆటంకమవుతున్నాయని, ఇవే 2014లో మెజార్టీ మతవాదం విజయం సాధించడానికి కార ణమైనాయనీ కూడా ఆ పత్రిక హెచ్చరించింది. బీజేపీ విధానాలపై వ్యతిరేకత కీలకమైనా భాగస్వా ముల మధ్య సమన్వయం కూడా కీలకంగా వుంటుం దనీ, రాష్ట్రాల ఎన్నికల్లో పెరిగే విభేదాలు తర్వాత దశలోనూ ప్రభావం చూపిస్తాయని పేర్కొంది.
బీజేపీ బహుముఖ దాడి
ప్రతిపక్షాల కూటమి పరిస్థితి ఈ విధంగా వుంటే మరోవంక బీజేపీ ఎన్‌డిఎ సర్కారు సమస్త శక్తులతో యుక్తులతో దాడి పెంచుతున్నది. ఇండి యా అనేది నిజంగానే తమకు బలమైన సవాలు అని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఇటీవల ఒప్పు కున్నారు. ఇకపైన ఏ ఎన్నికనూ తేలిగ్గా తీసుకోవ డానికి లేదని కిందనుంచి పైవరకూ నాయకత్వ మంతా కలసికట్టుగా పనిచేస్తేనే ఫలితాలు సాధించ గలమని ఆయనన్న మాట బీజేపీలో పరిస్థితికి ప్రతి బింబమే, ఆరెస్సెస్‌ కూడా ఈ ఎన్నికల నేపథ్యంలో మేధా మధన సదస్సులు నిర్వహించింది. గతవారం ఇదే శీర్షికలో చర్చించినట్టు త్రిముఖ వ్యూహంతో దాడి ప్రారంభించింది. ఎన్నికలు దగ్గరైన కొద్ది మరింత తీవ్రంగా దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పు తున్నది. నిజంగా ఇది విస్మరించరాని సవాలు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ఫిబ్రవరి నుంచి జైలులో వుండగా ఇటీవలే సుప్రీంకోర్టు బెయిలు నిరాకరించింది. స్వయంగా ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు కూడా ఇడి నోటీసులు జారీ అయ్యాయి. ఆప్‌ మంత్రి అశిథి మాట్లాడుతూ ఆయ నను అరెస్టు చేయాలన్నదే కేంద్ర బీజేపీ పన్నాగమని ప్రకటించింది. జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌ ఇప్పటికే దర్యాప్తును ఎదుర్కొంటున్నందున ఆయన్నూ అరెస్టు చేస్తారని ఆమె సందేహం వెలిబుచ్చారు. తేజస్వియాదవ్‌, మమతా బెనర్జీ, చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బెహల్‌లతో పాటు కేరళ ముఖ్య మంత్రి పినరాయి విజయన్‌ను, తమిళనాడు నేత స్టాలిన్‌నూ కూడా ఏదో విధంగా కేసుల్లో ఇరికించి నిర్బంధించే ప్రయత్నాలు జరుగు తున్నాయని విమర్శించింది. అరెస్టుల మాట ఎలా వున్నా ప్రతిపక్ష పార్టీలపైనా రాష్ట్రాలలో వాటి ప్రభు త్వాలపైన మాత్రం కేంద్రం వ్యూహాత్మకంగా దాడి తీవ్రం చేసింది. చత్తీస్‌ఘఢ్‌ ముఖ్యమంత్రి భూపేన్‌ బెహల్‌ మహదేవ్‌యాప్‌ అనే బెట్టింగ్‌ యాప్‌తో సంబంధం కలిగి వున్నారనీ, రూ.450 కోట్లు ఆయ నకు అందాయనీ ఇప్పుడు హఠాత్తుగా చర్యలు మొద లుపెట్టారు. కాంగ్రెస్‌ మహదేవ్‌ను కూడా వదలి పెట్టలేదని ప్రధాని మోడీ ఎన్నికల సభలో ఎద్దేవా చేశారు. రాజస్థాన్‌ మంత్రులపైన, కాంగ్రెస్‌ నాయకు లపైన కూడా దాడులు సోదాలు జరుపుతున్నారు. జల్‌ జీవన్‌ మంత్రిత్వ శాఖలో 20 వేల కోట్ల రూపా యల అక్రమాలు జరిగాయనీ వాటితో పిహెచ్‌డి మంత్రి మహేష్‌ జోషికి సంబంధముందనీ హడా వుడి మొదలెట్టారు. తెలంగాణలోనూ కాంగ్రెస్‌కు సంబంధించిన వారిపై ఐటి దాడులు ఇప్పుడే మొద లెట్టారు. ఇవన్నీ కావాలని ఈ తరుణంలో బనాయి స్తున్నారనే విమర్శలు మార్మోగుతున్నాయి. నిజంగా అవినీతి ఆరోపణలుంటే తప్పక చర్యలు తీసుకో వచ్చు. కాని సరిగ్గా ఎన్నికల తరుణంలోనే కేవలం ప్రతిపక్షాల వారిపైనే ఒక్కసారిగా దాడి చేయడంలో రాజకీయ కుత్సితం దాచేస్తే దాగేది కాదు.
దాడులు మాత్రమే గెలిపించలేవని తెలిసిన బీజేపీ నేతలు రాజకీయంగానూ నష్టనివారణ చర్య లు మొదలెట్టారు. తాము బీసీల కుల గణనకు వ్యతి రేకం కాదని హోంమంత్రి అమిత్‌ షా చెంపలు వేసు కున్నంత పనిచేస్తున్నారు. కాకపోతే బాధ్యత గల పార్టీగా సమగ్రంగా చేయాలన్నదే తమ ఉద్దేశమని వివరణ ఇస్తున్నారు.అయితే ఇదే విషయమై ప్రధాని మోడీ మొన్న దసరా సందర్భంలోనే భిన్నంగా మాట్లాడటం దేశం మర్చిపోలేదు. కులగణన దేశాన్ని విచ్చిన్నం చేస్తుందన్న అర్థంలో ఆయన దాడి చేశారు. కానీ ఇండియాలో చాలా పార్టీలు కులగణ నకు మద్దతివ్వడం, సుప్రీం కోర్టు కూడా బీహార్‌ సర్వే విడుదలకు అనుమతినివ్వడంతో బీజేపీ వెనక్కు తగ్గక తప్పలేదు. అయోధ్య రామమందిరం కూడా తమ ఎజెండాలో చేర్చుకున్న బీజేపీ నేతలు ప్రతి చోటా ఆ ప్రస్తావన తెస్తున్నారు. మిజోరాంలోనైతే మోడీ సభల్లో అయోధ్యకు యాత్రీకులను కోటా ప్రకారం పంపడం ఒక వాగ్దానంలా మాట్లాడారంటే పరిస్థితి అర్థమవుతుంది. మైనార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ మెజార్టీ మతస్తులను ఆకట్టుకునే ప్రయత్నం కూడా ఇందులో భాగమే. ఇదెక్కడ ప్రభా వం చూపుతుందోననే భయంతో మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్య మంత్రి కమల్‌నాథ్‌ రామమందిరం బీజేపీది మాత్రమే కాదనీ తానూ లక్షన్నర విరాళం ఇచ్చానని చెప్పుకోవడం కొసమెరుపు. రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా పర్యటించి ఎలాగైనా గట్టె క్కాలని బీజేపీ పథకాలు ఏ రూపం తీసుకునేది చూడవలసిందే.
తెలంగాణలో ఏం జరిగింది?
ఇంత తీవ్రంగా మతతత్వ శక్తులు కేంద్రం దాడి చేస్తుంటే కాంగ్రెస్‌ అందుకు దీటైన , విశాల విధా నం చూపించలేకపోవడం దురదృష్టకరం. తెలంగా ణలో ఆఖరి వరకూ ఆలస్యం చేసి వామపక్షాలకు ఒక్కసీటుతో సరిపెట్టాలని షరతుపెట్టింది. సీపీఐ చివరి నిముషంలో కొత్తగూడెం సీటులో కలసి పోటీ చేయడానికి , తర్వాత ఒక ఎంఎల్‌సి సీటు ఇచ్చేట్టు అంగీకారానికి వచ్చింది. మునుగోడులో స్నేహ పూర్వక పోటీ అని సీపీఐ చెబుతున్నా కాంగ్రెస్‌ వద్దని వారించినట్టు సమాచారం. సీపీఐ(ఎం) తాను స్వం తంగా 24 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటిం చింది. సీపీఐ సీట్లలో పోటీ పెట్టబోనని స్పష్టం చేసింది. ఇదే పరిస్థితి ఇతర రాష్ట్రాలలోనూ ప్రత్యక్ష మైంది. రాజస్థాన్‌లో 17చోట్ల పోటీ చేస్తున్నది. ఇండియా వేదిక పరిమితులపై సీపీఐ(ఎం) గతం లోనే స్పష్టమైన వైఖరి తీసుకున్న సంగతి గుర్తుండే వుంటుంది. ఇదొక కూటమి గానీ, వ్యవస్థ గానీ కాదని, లౌకిక శక్తుల కలయిక మాత్రమే నని ప్రక టించింది. సమన్వయ కమిటీలోనూ చేరబోనన్నది. జాతీయ ప్రాంతీయ పాలక లౌకికపార్టీల వూగిస లాటలు మతతత్వంపై నిరంతరపోరాటానికి ఒక ఆటంకంగా వున్నాయనేది వాస్తవమని కాంగ్రెస్‌ చర్యలు నిరూపిస్తున్నాయి. అయినా విశాల ప్రాతి పదికన లౌకికవిధానాల రక్షణకోసం ముందుకు సాగాల నడంలో సందేహం లేదు. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆ దిశలో ముందడుగు వేయాలని ఆశించాలి.
తెలకపల్లి రవి 

Spread the love