
మండలంలోని నాగాపూర్ లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇంటి స్థలాలను ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ గురువారం పరిశీలించారు. నాగపూర్ గ్రామాన్ని మండలంలో పైలట్ ప్రాజెక్టు గ్రామంగా గుర్తించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగా ప్రజా పాలన దరఖాస్తుల్లో భాగంగా ఇండ్ల నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను గుర్తించి ఇండ్లను మంజూరు చేశారు. ఇందిరమ్మ ఇండ్లు మంజరై ఇంటి స్థలాలు ఉన్న లబ్ధిదారులతో ఎంపీడీవో మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరత గతిన చేపట్టాలని, ఇందుకు ఇండ్ల నిర్మాణం కోసం మార్కౌట్ పనులను పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన పలువురు లబ్ధిదారుల ఇంటి స్థలాలను ఆయన పరిశీలించారు. స్థలాలను శుభ్రం చేసుకొని, నిర్మాణం కోసం ముగ్గురు పోసుకునే కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. తద్వారా ఇండ్ల నిర్మాణాలను చేపట్టేందుకు వీలుంటుంది అన్నారు.
ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి సంధ్య, తదితరులు ఉన్నారు.