
– అంతా సిన్ లేదంటున్న జగదీష్ రెడ్డి వర్గ్యులు,
– అంతుచిక్కని హ్యాట్రిక్ ఎమ్మెల్యే మనోగతం,
– ఎమ్మెల్సీ కోటిరెడ్డి కి లభించని ఓటు,
– బిజెపి కౌన్సిలర్లలలో తర్జనభర్జనలు,
– కలెక్టరేట్ లో విప్ అందజేసిన బి.ఆర్.యస్ పార్టీ,
జిల్లాలో ఉత్కంఠ.
నవ తెలంగాణ-సూర్యాపేట : మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ లపై శనివారం అసమ్మతి కౌన్సిలర్లు పెట్టనున్న అవిశ్వాసం ఉత్కంఠకు దారితీస్తుంది.జిల్లా కేంద్రంలో ఎక్కడా చూసిన కూడా అవిశ్వాసం పైనే ముచ్చట్లు,చర్చలు సాగుతున్నాయి.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ లలో అవిశ్వాసాలు జోష్ కొనసాగుతున్న విషయం తెల్సిందే. దీంతో బి.ఆర్.యస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతుంది.దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 35 మున్సిపాలిటీ లలో అవిశ్వాసం తో బి.ఆర్.యస్ పార్టీ చైర్మన్, వైస్ ఛైర్మన్ స్థానాలను కోల్పోయింది.కాగా 2019 మున్సిపల్ చట్టంలో అవిశ్వాసం నెగ్గిన తర్వాత తిరిగి చైర్మన్ ఎన్నిక పై సరైన క్లారిటీ లేకపోవడంతో చైర్మన్ ల ఎన్నిక జరగని పరిస్థితి ఏర్పడింది.మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నల్గొండ మున్సిపాలిటీ లో కూడా అవిశ్వాసం నెగ్గి 15 రోజులు దాటిన ఇంతవరకు కూడా చైర్మన్ ఎన్నిక జరగలేదు.
మరి ఈ క్రమంలో శనివారం సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ, వైస్ ఛైర్మన్ పుట్ట కిషోర్ ల పై జరిగే అవిశ్వాసం ఉత్కంఠకు దారితీస్తుంది. ప్రధానంగా ఇక్కడ బి.ఆర్.యస్ కు చెందిన దిలిప్ రెడ్డి తన భార్య ను చైర్మన్ గా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తన మద్దతుదారులను తీసుకొని క్యాంపు కు వెళ్లిన విషయం తెల్సిందే. అదేవిధంగా మిగిలిన జగదీష్ రెడ్డి వర్గ్యులు కూడా క్యాంపు లొనే వున్నారు. ఇడిగాక కాంగ్రెస్, బీజేపీ, బిఎస్పి కౌన్సిలర్లలలో ఒకరిద్దరు తప్ప మిగతా వారు క్యాంపు కు వెళ్లినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో 27 న జరిగే అవిశ్వాసం తీర్మానం కు దిలిప్ రెడ్డి తన 32 మంది మద్దతుదారులతో తప్పకుండా హాజరుకావాల్సి ఉంటుంది.తప్పనిసరిగా అవిశ్వాసం నెగ్గి తీరుతామని దిలిప్ శిబిరంలో ఉన్న అసమ్మతి కౌన్సిలర్లు చెబుతున్నారు.ఇదిలావుండగా జగదీష్ రెడ్డి వర్గ్యులు మాత్రం ఈ సమావేశానికి గైర్హాజరు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా అవిశ్వాసం తీర్మానం నోటీస్ పై సంతకాలు పెట్టిన బీజేపీ కౌన్సిలర్ల స్టాండ్ ఎంటన్నది సస్పెన్స్ గా ఉంది. ఇంకా బి.ఆర్.యస్ కు చెందిన ఎమ్మెల్సీ కోటిరెడ్డి కి ఓటు హక్కు కల్పించలేదని సమాచారం. దీని పై ఆయన ఎలాoటి స్టెప్ తీసుకొనున్నారో తేలాల్సి ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే హ్యాట్రిక్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మనోగతం అంతుచిక్కడం లేదు. ఈ ఎపిసోడ్ పై ఆయన మాత్రం మొదటి నుంచి కూడా చాలా కూల్ గా ఉండడంతో పాటు తన కౌన్సిలర్లతో ఏమి కాదని అవిశ్వాసం పై అంతా సీన్ లేదంటూ వారిలో మనోధైర్యం నింపుతున్నారు.ఇదిగాక బి.ఆర్.యస్
పార్టీ పై గెలిచిన 24 మంది కౌన్సిలర్లకు విప్ జారీ చేశారు. కౌన్సిలర్ల నివాసాల్లో ఉన్న కుటుంబ సభ్యులకు విప్ పత్రాలు అందజేశారు. మరికొన్ని నివాసాల వద్ద వారు లేకపోవడంతో ఇంటికి అతికించి ఫోటో తీసి సంబంధిత కౌన్సిలర్ కు చెందిన వాట్సాప్ కు సెండ్ చేశారు. ఈ మేరకు విప్ జారీ చేసిన పత్రాలను ఆ పార్టీ నాయకులు కలెక్టరేట్ లో అందజేశారు.ఇక ఇప్పటి వరకు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా ఈ అవిశ్వాసం ఎపిసోడ్ పై బహిరంగంగా స్పందించక పోయిన అవిశ్వాసం నెగ్గెందుకు తెర వెనుక మాత్రం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ అవిశ్వాసం ఎపిసోడ్ ను ఇరు వర్గాలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎం జరుగుతుందో అనే టెన్షన్ జిల్లాలో ఏర్పడింది.