రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి అన్యాయం

రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి అన్యాయం– ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బడ్జెట్‌ పత్రాల దగ్ధం
నవతెలంగాణ-నిర్మల్‌
తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం చేసిందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దిగంబర్‌, నవీన్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర వసతి గృహంలో బడ్జెట్‌ పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 7.3 శాతం కేటాయించిందని, ఇది గత ఓటాన్‌ బడ్జెట్లో కేటాయించిన బడ్జెట్‌ కంటే తక్కువ ఉందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో పెట్టినట్లు ప్రతి మండలంలో తెలంగాణ మోడల్‌ ఇంటర్నేషనల్‌ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పిందని, కానీ దాని ఊసు ఈ బడ్జెట్లో లేదన్నారు. ప్రతి రెండు గ్రామాలకు ఒక గురుకులమని, యూనివర్శిటీల అభివృద్ధి కోసం కేవలం రూ.500 కోట్లు కేటాయించారన్నారు. గత బీఆర్‌ఎస్‌ పాలనలో యూనివర్శీటీలు దెబ్బతిన్నాయని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధికి నిధులు ఇస్తామని హామీ ఇచ్చి బడ్జెట్లో కేటాయింపులు లేవన్నారు. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలా కాకుండా 15 శాతం పైగా నిధులు విద్యారంగానికి కేటాయిస్తామని హామీ ఇచ్చి 7.3 శాతం నిధులు మాత్రమే కేటాయించారని విమర్శించారు. తక్షణమే బడ్జెట్‌ సవరించి విద్యారంగానికి నిధులను పెంచి ప్రభుత్వ విద్యారంగాని అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు రాహుల్‌, కార్తీక్‌, కిరణ్‌ పాల్గొన్నారు.

Spread the love