నిజమైన తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం: కొత్తగట్టు యాకయ్య

నవతెలంగాణ – తిరుమలగిరి 
తెలంగాణ నిజమైన ఉద్యమకారులను గుర్తించకపోవడం పట్ల తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన కొత్తగట్టు యాకయ్య మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద జాతీయ జెండా పట్టుకుని,నల్ల కండువా కప్పుకొని  నిరసన వ్యక్తం చేశారు.తెలంగాణ మలిదశ ఉద్యమంలో స్వర్గీయ ఆలే నరేంద్ర ఉన్నప్పటినుండి ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ అనేక నిర్బంధాలకు కేసులకు గురై,ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలో భాగస్వామిని పోరాటం చేసినవారిని గుర్తించకుండా,ఎవరెవరినో గుర్తించి రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా హైదరాబాదులో  ఎంపిక చేయడం సరికాదని,అప్పటి ఉద్యమకారుడు ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ కు తెలియదా..తిరుమలగిరి ప్రాంతంలో అసలైన ఉద్యమకారులు ఎవరో అని ప్రశ్నించారు. తిరుమలగిరిలో తెలంగాణ ఉద్యమకారుల ఎంపికలో తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.నాటి నుండి నేటి వరకు నమ్మిన నాయకుని కోసం సిద్ధాంతం కోసం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని స్వాగతించినోన్ని నాకంటే ఎక్కువ ఈ ప్రాంతంలో ఉద్యమకారులు ఎవరని ఇప్పటికైనా ఈ తప్పిదాన్ని వెనక్కి తీసుకుని అసలైన ఉద్యమకారులను గుర్తించాలని జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని,అధికారులను నాయకులను వేడుకొన్నారు. గత పాలకులు చేసిన తప్పే..నేటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని గుర్తు చేశారు.నిజమైన ఉద్యమకారులకు న్యాయం జరిగేంత వరకు పోరాటాలు చేస్తూనే ఉంటామని డిమాండ్ ను వినిపించారు.
Spread the love