
మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో డ్రోన్ కెమెరాలతో వరి పంటకు పురుగుల మందు పిచికారి చేశారు. కూలీల కొరత తో పాటు ధరలు పెరగడం వల్ల రైతులు ఇలాంటి అధునాతన పద్ధతులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సబ్సిడీపై డ్రోన్ కెమెరాతో పురుగుల మందు పిచికారి చేస్తున్నారు. వరి పంటకు డ్రోన్ కెమెరా సహాయంతో పురుగుల మందు పిచికారికి ఎకరాకు 400 రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు. అనంతరం రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ రైతులకు సబ్సిడీపై పలు రకాల సేవలను అందిస్తున్నమని, తాము అందిస్తున్న సబ్సిడీ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.