స్టాఫ్ నర్సు ఉద్యోగ నియామకాల్లో వికలాంగులకు మొండి చెయ్యి

– 4శాతం రిజర్వేషన్ అమలు ఎక్కడ
– 2016 ఆర్ పీడీ చట్టానికి భిన్నంగా ఉద్యోగ నియామకాలు
– సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసిన వికలాంగ అభర్థులకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలి
ఎన్ పీఆర్ డీ జిల్లా కమిటీ డిమాండ్
నవతెలంగాణ  – భువనగిరి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తున్న స్టాఫ్ నర్స్ ఉద్యోగ నియామకల్లో వికలాంగులకు మొండి చెయ్యి చూపిందని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయినప్పటికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు మోసం చేస్తుందని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ  పేర్కొంది.  బుధవారం  అధ్యక్షులు స్వరూపంగా ప్రకాష్ జిల్లా కార్యదర్శి వనం ఉపేందర్ జిల్లా కోశాధికారి బొల్లెపల్లి స్వామి మహిళా అధ్యక్షురాలు కొత్త లలిత  ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ అస్పత్రులు, గురుకుల విద్యాలయాలు, వివిధ ప్రభుత్వ సంస్థల్లో 7094 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీ కోసం వ్రాత పరీక్ష నిర్వహించడం జరిగింది. అర్హత కలిగిన అనేక మంది వికలాంగులు  పరీక్ష రాసి ఉత్తిర్ణత సాధించినారు.2016వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం ప్రభుత్వం భర్తీ చేస్తున్న ఉద్యోగ నియామకాల్లో వికలాంగులకు 4 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తున్న స్టాఫ్ నర్సు పోస్టుల్లో వికలాంగులతో భర్తీ చేయడం లేదు.ప్రభుత్వం భర్తీ చేస్తున్న 7094 పోస్టుల్లో 4శాతంప్రకారం 283 పోస్టులు వికలాంగులతో భర్తీ చేయాలి. 138 పోస్టులు శారీరక వికలాంగులు లేరనే కారణంతో భర్తీ చేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్టాఫ్ నర్సు ఉద్యోగ నియామకాల్లో అర్హత సాధించిన వికలాంగులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని  డిమాండ్ చేశారు.
Spread the love