ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌ ఆరోగ్యంపై ప్రభావాలు

MSGఇన్‌స్టంట్‌ నూడుల్స్‌ నేడు చాలా మందికి ఇష్టమైన తక్షణ ఆహారంగా మారిపోయింది. ఈ నూడుల్స్‌ త్వరగా తయారు చేసుకోవచ్చని, రుచికరంగా ఉంటుందని, చాలా మంది పిల్లలు, యువత, పెద్దలు కూడా దీనిని ఇష్టపడతారు. ముఖ్యంగా, వంట చేయడానికి ఎక్కువ సమయం లేకపోవడం వల్ల, ఇది బిజీ జీవితంలో ఒక శీఘ్ర భోజనంగా మారింది.
నూడుల్స్‌ తయారీ కొంతవరకు సాధారణంగా కనిపించినప్పటికీ, దీని తయారీ విధానం కొంత క్లిష్టమైనది.
గోధుమ పిండి (Maida) లేదా ప్రాసెస్డ్‌ గోధుమను మెత్తగా చేసి, దాని నుండి నూడుల్స్‌ తయారు చేస్తారు.
వీటిని ఆవిరి ద్వారా మదువుగా చేసి, ఆపై (Frying) లేదా ఎండబెట్టడం ద్వారా నిల్వ చేయగలిగేలా తయారు చేస్తారు.
నూడుల్స్‌ ప్యాక్‌తో పాటు మసాలా సాట్‌ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ మసాలాలో వివిధ రకాల మసాలా దినుసులు, ఉప్పు, సుగంధ ద్రవ్యాలు, రసాయనాలు, రుచికరమైన పదార్థాలు ఉంటాయి.
నిల్వ కోసం ఉపయోగించే రసాయనాలు (Preservatives)
నూడుల్స్‌ ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి దీనిలో కొన్ని రసాయన పదార్థాలను కలుపుతారు. ముఖ్యంగా:
టర్బుటీల్‌ హైడ్రోక్సీ క్వినోన్‌ (TBHQ) – – ఇది ఒక రకమైన కత్రిమ పదార్థం(preservative), , ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా సహాయపడుతుంది.
మోనోసోడియం గ్లూటామేట్‌ (MSG) – ఇది రుచిని పెంచడానికి ఉపయోగించబడుతుంది. అయితే, ఇది అధిక మోతాదులో తీసుకుంటే ఆరోగ్యపరమైన సమస్యలు కలిగించే అవకాశం ఉంది.
ఆరోగ్యంపై ప్రభావాలు
ఉబ్బసం, ఆమ్లత్వం : నూడుల్స్‌లో ఉపయోగించే MSG, ఇతర రసాయనాలు కడుపులో ఉబ్బరం, గ్యాస్‌ సమస్యలను కలిగించవచ్చు.
బరువు పెరుగుదల: నూడుల్స్‌ అధిక కార్బోహైడ్రేట్స్‌, కొవ్వుతో కూడినవి కాబట్టి అధికంగా తీసుకుంటే ఊబకాయం సమస్య తలెత్తవచ్చు.
హదయ సంబంధిత సమస్యలు : ఎక్కువగా ప్రాసెస్డ్‌ ఆహారాలు తీసుకోవడం వల్ల రక్తపోటు, హార్ట్‌ ప్రాబ్లమ్స్‌ రావొచ్చు.
ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌లో ప్రిజర్వేటివ్స్‌, మైదా (Refined Flour – Maida) అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థ పనితీరును దెబ్బతీసి, మలబద్ధకం వంటి సమస్యలను కలిగించవచ్చు.
పిల్లలకు హానికరం: MSG వంటి రసాయనాలు పిల్లల మెదడు అభివద్ధిని దెబ్బతీయవచ్చని కొంతమంది ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ప్లీడెడ్‌ లీడ్‌ ఉండటం: లీడ్‌ అనేది ప్రమాదకరం. లీడ్‌ ఎక్కువగా శరీరంలో చేరితే మూత్రపిండాల సమస్యలు, మెదడు అభివద్ధి సమస్యలు కలుగుతాయి.
MSG అధిక మోతాదు: అనుమతించిన మోతాదును మించి MSG ఉండటం ఆరోగ్యానికి హానికరంగా మారింది.
తప్పుదోవ పట్టించే ప్రకటనలు : ”100 సురక్షితమైన ఆహారం” అని చెప్పడం ద్వారా, అసలు రసాయనాలను, వారి ప్రభావాలను దాచిపెట్టడం జరిగింది.
”ఆరోగ్యమే మహాభాగ్యం! చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ను తగ్గించి, బ్యాలెన్స్‌/ సంతులిత ఆహారాన్ని అలవాటు చేసుకోవడం మంచిది.”

Dr.Prathusha. Nerella
MD(General Medicine) CCEBDM; CCGDM; NLP; FID
Senior General Physician, Positive Psychologist certified Nutritionist, Diabetes And Lifestyle Expert, Pranic Healer Chiief Holistic Health Consultant And Medical Director @ Praveha General, Diabetes And Lifestyle Clinic – A Holistic Centre With Integrated Approach. Ph: 8897684912/040-49950314

Spread the love