
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: సర్పంచ్ ల స్థానంలో సర్పంచ్లనే పర్సన్ ఇన్చార్జిలుగా నియమించాలని కోరుతూ చౌటుప్పల్ మండల సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో సోమవారం జాతీయ రహదారిపై రాస్తారోకో ధర్నా నిర్వహించారు.సర్పంచ్ల పదవి కాలం ఫిబ్రవరి 1 తేదీన ముగియడంతో సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు.చౌటుప్పల్ మండల సర్పంచ్ల ఫోరం సంఘం అధ్యక్షులు మునగాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సర్పంచ్ ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించి సర్పంచ్ లోని పర్సన్ ఇన్చార్జిలుగా నియమించాలని కోరారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం సర్పంచ్లు అప్పులు తీసుకొచ్చి సర్పంచుల ప్రాణాలతో గవర్నమెంట్ చెలగటం ఆడుతుందని దుయబెట్టారు. మా బిల్లులు చెల్లించింతవరకు మమ్మల్ని పర్సనల్ ఇన్చార్యులుగా నియమించాలని గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కలిసి సమస్యలు చెప్పుకోవడం జరిగిందని వారు చెప్పారు. గ్రామపంచాయతీ సర్పంచ్ల ఎన్నికల జరిగేంతవరకు సర్పంచ్లనే పర్సన్ ఇన్చార్జిగా నియమించాలని సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు మునగాల ప్రభాకర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కళ్లెం శ్రీనివాస్ రెడ్డి,కొలను శ్రీనివాస్ రెడ్డి,ఎలువర్తి యాదగిరి,బాతరాజు సత్యం,బూరుగు విజయలక్ష్మి, వేణుగోపాల్ గౌడ్,చిన్నం లావణ్య,రమేష్ గౌడ్,బచ్చ రామకృష్ణ, నరసింహ నాయక్,భూలక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.