నవతెలంగాణ-పెద్దవూర
మండల కేంద్రం లోని ఇంటి గ్రేటెడ్ బాలికల సాంఘీక సంక్షేమ వసతి గృహాన్ని గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు కలెక్టర్ కు పూల బుకే అందించి ఘన స్వాగతం పలికారు. ఈసందర్బంగా వండిన భోజనాన్ని,విద్యార్థుల హాజరుశాతం పరిశీలించి వార్డెన్ తో సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే భోజన పదార్ధాల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. బాలికల వసతిగృహంలో ని తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, కూరగాయలు, కోడిగుడ్లు, వంట నూనె, పప్పు దినుసులు, ఇతర సరుకుల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించి, మెనూ ప్రకారంగానే ఉన్నాయా? అని తనిఖీ చేశారు. సన్నబియ్యం నాణ్యతలో ఏమైనా తేడా ఉంటోందా అని మెస్ ఇంచార్జ్ లను ఆరాతీశారు. ఎలాంటి ఇబ్బందులు లేవని, నాణ్యమైన బియ్యం, భోజనం వండడానికి ముందే ప్రతి రోజు సరుకుల నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేసేలా చూడాలన్నారు. ఆహార పదార్థాలను స్టీల్ డబ్బాలలో భద్రపర్చి, వాటిపై తప్పనిసరిగా మూతలు భిగించాలని అన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, ఉదయం, సాయంత్రం సమయాలలో అల్పాహారం, స్నాక్స్ అందించాలని సూచించారు.ఈమె వెంట మండల ప్రత్యేక అధికారి రాజ్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపిడీఓ సుధీర్ కుమార్,ఆర్ఐ దండ శ్రీనివాస్ రెడ్డి,వార్డెన్ అహల్య సిబ్బంది వున్నారు.