నవతెలంగాణ అశ్వరావుపేట:
ఈ నెల 5 వ తేది బుధవారం ప్రారంభం అయిన పరీక్షలు బుధవారం నాటికి ఆరో రోజుకు చేరాయి.నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ముస్లిం మైనార్టీ బాలికల జూనియర్ కళాశాల, వీకేడీవీఎస్ రాజు జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన మూడు పరీక్షా కేంద్రాల్లో ఈ మూడూ కళాశాలతో పాటు దమ్మపేట మండలంలోని మందలపల్లి సాంఘీక సంక్షేమ గురుకుల కళాశాల, దమ్మపేట లోని గిరిజన సంక్షేమ శాఖ గురుకుల కళాశాల, అంకంపాలెం గిరిజన సంక్షేమ శాఖ బాలికల కళాశాల విద్యార్ధులు పరీక్షలు రాస్తున్నారు.
ఈ మూడు కేంద్రాల్లో, ఆరు కళాశాలల నుండి ద్వితీయ సంవత్సరం గణితం, వృక్షశాస్త్రం, పౌర శాస్త్రం కోర్సుల పరీక్షలకు 808 మంది హజరు కావాల్సి ఉండగా 796 మంది హాజరు అయ్యారు.12 మంది పరీక్షలకు గైర్హాజరు అయ్యారు.
ఆయా పరీక్షల కేంద్రాలకు సీఎస్ (చీప్ సూపరింటెండెంట్), డీఓ(డిపార్ట్ మెంట్ ఆఫీసర్), కస్టోడియన్ లుగా అల్లు అనిత, జెడ్.ఉషా రత్నం, కే.రవీంద్రబాబు, ఎం.ఝాన్సీ లక్ష్మి, బి.సంగీత, బి.కుమారస్వా మి, డి.నరసింహారావులు విధులు నిర్వహిస్తున్నారు.
కళాశాల ఎలాట్మెంట్ ప్రెసెంట్ ఆబ్సెంట్
జీజేసీ 333 326 07
టీఎంఆర్ 152 150 02
వీకేడీవీఎస్ 323 320 03
మొత్తం 808 796 12