పోలీస్ స్టేషన్ కు చేరిన ఇంటర్ ప్రశ్నాపత్రాలు

నవతెలంగాణ – తుంగతుర్తి
ఈనెల 28 నుండి జరగనున్న ఇంటర్ పరీక్షల సెట్- ఎ,సెట్-బి ప్రశ్నా పత్రాలు శనివారం నియోజకవర్గ కేంద్రంలోని తుంగతుర్తి పోలీస్ స్టేషన్ కు చేరాయి.ఈ పరీక్షలకు జనరల్ ఇంటర్ ప్రథమ సంవత్సరం 392 మంది విద్యార్థులు,ద్వితీయ సంవత్సరం 361 మంది విద్యార్థులు,జనరల్ ఇంటర్ నుండి మొత్తం753 మంది విద్యార్థులు,అలాగే ఒకేషనల్ ప్రథమ సంవత్సరం 74,ద్వితీయ సంవత్సరం 63 మంది మొత్తం ఒకేషనల్ నుండి 137 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఒకేషనల్ జనరల్ కలిపి మొత్తం 890 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ మేరకు మండల కేంద్రంలో 1. ప్రభుత్వ జూనియర్ కళాశాల,2. గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.చీఫ్ సూపర్డెంట్లు గా ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ లు ప్రభాకర్ రెడ్డి,నీలారాణి,డిపార్ట్మెంటల్ ఆఫీసర్లుగా శ్రీనివాస్,నరేందర్ లు విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది బింగి వెంకటేశ్వర్లు,సలీం,గణేష్,తోట యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
Spread the love