యూనివర్సిటీలో అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం..

నవతెలంగాణ -డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ  కాలేజ్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ లో జరిగిన అంతర్జాతీయ మానవ సంఘీభావం దినోత్సవానికి ప్రొఫెసర్. కే. అపర్ణ విభాగధిపతిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ అపర్ణ  మాట్లాడుతూ ప్రపంచమంతా స్వేచ్ఛ,సమానత్వం, శాంతి చేకూరాలని ప్రజలందరూ ఐక్యమతంగా ఉండాలని పిలుపునిచ్చారు.ప్రొఫెసర్ సిహెచ్.ఆంజనేయులు  మాట్లాడుతూ మనవ సంబంధాలను కాపాడుకోవాలని మానవ సంబంధాల విలువల్ని గొప్పతనాన్ని ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ప్రొఫెసర్ నాగరాజు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు ఐక్యమత్తంగా ఉంటూ ప్రజలందరికీ శాంతినించే విధంగా మానవ హక్కులకు అనుగుణంగా ఉండాలని తెలిపారు. డాక్టర్ నాగరాజు పాత  విద్యార్థులకు పి పి టి ప్రజెంటేషన్, వీడియో ప్రజెంటేషన్ ఈ ద్వారా కార్యక్రమ  గొప్పతనాన్ని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంబీఏ, ఐ ఎం బి ఏ  విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love