నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్
ప్రభుత్వ వైద్య కళాశాల, నల్లగొండ యందు డాక్టర్ విభాగములో బోధన సిబ్బంది పోస్టుల భర్తీ కోసం ఈ నెల 17న ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రొఫెసర్ 7, అసోసియేట్ ప్రొఫెసర్ 17, అసిస్టెంట్ ప్రొఫెసర్ 43, సీనియర్ రెసిడెంట్ 33, పోస్టులను తాత్కాలిక పద్ధతిన 2025 మార్చి 31 వరకు పనిచేయుటకు ఇంటర్వ్యూలు నిరహిస్తున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ధరఖాస్తులను సూచించిన తేదీన ఉదయం 10 లోగా ప్రభుత్వ మెడికల్ కళాశాల నందు దరఖాస్తులను అందజేసి ఇంటర్వ్యూలకు హాజరుకావాలని పేర్కొన్నారు.