టీఎస్ యూటీఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ

– జిల్లా కార్యదర్శి ఇస్లావత్ హతిరామ్
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
మండల కేంద్రంలోని ఎం.ఆర్.సీ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నూతన సంవత్సరం 2024 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆళ్ళపల్లి విద్యాశాఖాధికారి పి.కృష్ణయ్య చేతుల మీదుగా జరిగిందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఇస్లావత్ హతిరామ్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనంతోగు, ఆళ్ళపల్లి, మర్కోడు కాంప్లెక్స్ హెచ్.ఎంలు బి.భావుసింగ్, కె.శాంతారావు, బి.బాబులాల్, సంఘం ఉపాధ్యక్షులు కల్తి కృష్ణ, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు మోహన్ బాబు, సీ.ఆర్.పీలు గొగ్గెల రామయ్య, సునీత, తదితరులు పాల్గొన్నారు.
Spread the love