సిఇఓ మార్పుపై ఇన్వెస్టర్లకు ఓటింగ్‌ హక్కుల్లేవు

– స్పషం చేసిన బైజూస్‌ కంపెనీ
న్యూఢిల్లీ: వాటాదారుల ఒప్పందం ప్రకారం సిఇఓ లేదా నిర్వహణా మార్పులపై ఇన్వెస్టర్లకు ఓటింగ్‌ హక్కులు లేవని బైజూస్‌ శుక్రవారం తెలిపింది. బైజూస్‌ బ్రాండ్‌ పేరుతో పనిచేస్తున్న సాంకేతిక విద్యా సంస్థ అయిన థింక్‌ అండ్‌ లెర్న్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లోని సమస్యలను పరిష్కరించేందుకు, సంస్థపై కంపెనీ వ్యవస్థాపకులకు గల నియంత్రణను తొలగించేందుకు జరుగుతున్న అసాధారణ సమావేశానికి ఆరుగురు బైజూస్‌ ఇన్వెస్టర్లను పిలిచారు. గ్రూపు సిఇఓ, వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌ను మార్చే ఉద్దేశ్యంతో జరుగుతున్న ఈ సమావేశంలో పాల్గొని ఓటు వేసేందుకు వారికి ఎలాంటి హక్కు లేదని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీ నాయకత్వ మార్పు కోసం, ప్రస్తుత వ్యవస్థాపకుల అధీనంలో కంపెనీని లేకుండా చేసేందుకు ఈ అసాధారణ సమావేశం జరుగుతోందని ఇటీవల ఒక ఇన్వెస్టర్ల బృందం వాటాదారులకు నోటీసు జారీ చేసింది. ఆ నోటీసుకు బైజూస్‌లో దాదాపు 30శాతం వాటాలు వున్న పలు కంపెనీలు మద్దతిచ్చాయి. అయితే పెద్ద సంఖ్యలో వాటాదారుల నుండి తమకు మద్దతు వుందని కంపెనీ ప్రకటించింది. కొంతమంది ఇన్వెస్టర్లు లేవదీసిన ఈ వివాదానికి కంపెనీ, ఉద్యోగులు మూల్యం చెల్లిస్తున్నారని కంపెనీ.

Spread the love