నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
2024 – 25 విద్యా సంవత్సరానికి గాను అంబేద్కర్ విదేశీ విద్యనిధి పథకం ద్వారా అర్హులైన ఎస్సి కులానికి సంబంధించిన విద్యార్థుల నుంచి విదేశాల్లో ఉన్నత చదువులకు ఉపకార వేతనం కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులముల అభివృద్ధి అధికారి డీకే వసంతకుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు మార్చి 20వ తేదీ నుంచి మే 19వ తేదీలోగా చేసుకోవాలని, సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు జిల్లా కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.