
నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క, సారలమ్మ మేడారం మహా జాతరకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డికి ఆలయ పూజారుల సంఘం ఆహ్వానపత్రికను శనివారం అందజేసింది. ఈ సందర్భంగా మేడమ్ జాతర పోస్టర్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. వచ్చే నెల ఫిబ్రవరిలో జరుగనున్న మేడారం జాతర ఏర్పాట్లు, జాతరలో చేపట్టవలసిన పనులు, పూజారుల సమస్యలపై పూజారులు, దేవాదాయం శాఖ అధికారులు సీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు. వీరి వెంటే మంత్రులు సీతక్క, కొండ సురేఖ, పొంగులేటిశ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సలహాదారు వేం నరేందర్ రెడ్డి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 23న మేడారం జాతరకు తాను వస్తానని పూజారుల సంఘం సభ్యులకు సీఎం హామీ ఇచ్చారు.
