
– రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
నవ తెలంగాణ – మల్హర్ రావు
కళ్యాణలక్ష్మీ పథకం మంజూరులో లబ్ధిదారుల నుంచి లంచాల పేరిట అధికారులు, దళారులు గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడినట్లుగా తెలిస్తే సహించేది లేదని తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంథని క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మీ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మంథని మండలంలో (17),కమాన్ పూర్ మండలంలో (4), రామగిరి మండలంలో (2),పాలకుర్తిలో (07) కల్యాణ లక్ష్మీ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం మంథనిలోని గంగాపురిలో ఎస్ఆర్ నూతన సినిమా థియేటర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.