అమెరికాలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య.. కారణం అదేనా..!

Telugu student suicide in America.. Is that the reason..!నవతెలంగాణ – హైదరాబాద్: బహిష్కరణ భయంతో అమెరికాలో ఓ తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో అతడు ఏ ప్రాంతానికి చెందిన వాడన్న వివరాలు లభ్యం కాలేదు. అతడి స్నేహితుడి కథనం ప్రకారం.. ఆత్మహత్య చేసుకున్న యువకుడి పేరు సాయికుమార్‌రెడ్డి. ఉన్నత విద్యను అభ్యసించేందుకు న్యూయార్క్ వెళ్లాడు. అక్కడే తాత్కాలికంగా ఉద్యోగం చేస్తున్నాడు. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత అమెరికాలోని అక్రమ వలసదారులను వెనక్కి పంపుతున్నారు. ఈ క్రమంలోనే సాయికుమార్‌రెడ్డి పనిచేసే చోట కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. సాయికుమార్‌రెడ్డి పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. దీంతో తనను కూడా బహిష్కరిస్తారన్న భయంతో పనిచేస్తున్న చోటే సాయికుమార్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love