- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఇజ్రాయిల్-లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. లెబనాన్ దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయిల్ తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 31 మంది మరణించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. లెబనాన్‌లోని పలు గ్రామాలు, నివాస ప్రాంతాలు, హెజ్‌బొల్లా అనుమానిత స్థావరాలపై ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలు సహా పలువురు పౌరులు మృతి చెందినట్లు సమాచారం. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. లెబనాన్ ప్రభుత్వం ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని ఆరోపించింది .
- Advertisement -



