ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం..

నవతెలంగాణ – భువనగిరి
cన్యాయమూర్తి ఎ. జయరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమములో పాల్గొన్న న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తెలంగాణ రాష్ట్ర ప్రార్ధన గీతాన్ని ఆలపించారు. తదుపరి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి. హరినాథ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కోర్టు ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఈ  సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ఏ బృహత్తర కార్యాక్రమమైన  ఐకమత్యముతో, పరిపూర్ణ  సాధనతో కృషి చేస్తే సులువుగా సాధించవచ్చన్నారు.  న్యాయ పరంగా చట్ట పరిధిలలో హక్కుల సాధికరణ చేసుకునేటట్లు చైతన్యము పొందాలన్నారు. ఎంతో శక్తి, త్యాగం, ప్రాణం సమర్పించి సాధించుకున్న రాష్ట్రాన్ని ప్రతీ పౌరుడు ప్రగతివైపు సాగేలా కృషి చేయాలని తెలిపి శుభాకాంక్షలు తెలిపారు. భువనగిరి ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి వి. మాధవిలత మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫురణతో మనుగడ సాగిస్తే అద్భుతమైన నాగరిక సమాజాన్ని ఏర్పరుచుకోవచ్చని, న్యాయ సేవ అధికార సంస్థకు న్యాయవాదులు సహకారాన్ని అందించి చట్టాలపై పరిజ్ఞానం చేయటములో , రాజ్యాంగ బద్ద సమాజం ఏర్పాటు చేయటములో , అర్హులైన వారికి న్యాయసహాయం అందించటములో లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు వారి కేసులను పరిష్కరించుకొనుటలో చేయుత ఇవ్వాలన్నారు.  రాష్ట్రాన్ని కాలుష్య రహిత రాష్ట్రంగా మార్చటములో కృషి చేయాలని తెలిపారు.
ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు, అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి. కవిత మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షం కావాలంటే విజ్ఞానంతో పాటు, కట్టుబాటు, నిస్వార్థం ఉండాలని క్రొత్త చట్టాలు జులై 1 నుండి అమలు కాబోతున్నాయని వాటిపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి. హరినాథ్ మాట్లాడుతూ రాష్ట్ర సాధనలో న్యాయవాదుల పాత్ర ఎంతో ఉందని, న్యాయమూర్తులు కుడా ఎంతో కృషి చేసారని, రాష్ట్ర సాధనకోసం అమరులు అయిన వారిని స్మరించుకోవటం మన విధి అని తెలిపారు. కార్యక్రమములో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కె. జయ, కార్యదర్శి కె. కృష్ణ,  సీనియర్ న్యాయవాదులు రాష్ట్ర సాధనకు చేసిన కృషిని అమరులు అయినవారిని స్మరించుకొని అందరిచే జేజేలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులకు, న్యాయవాదులు పి.బాలకృష్ణారెడ్డి, నాగరం అంజయ్య, వి. భాస్కర్ రెడ్డి, బి.వెంకటేశం, గోదా వెంకటేశ్వర్లు, పి. శ్రీధర్, కె. జయ, పి. రాంరెడ్డి, ఐ. కృష్ణయ్య, జి. శంకర్, ఆకుల మల్లేష్ , జి. శ్రీనివాస్, శివకిరణ్, కె. యాదయ్య, సురేష్, కె. కృష్ణ, రజని, కె.జయ, ఎస్. శంకర్, హమీద్, రవీందర్ మరియు జిల్లా కోర్టు ఎ. ఒ. రామకోటి,  సిబ్బంది కె.వెంకట్ రెడ్డి, వేణుగోపాల్ సన్మానించారు.
అమరుల త్యాగాలని మరువలేము: ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటలో అమరుల త్యాగాలని మరువలేమని కాంగ్రెస్ పార్టీ తోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటన వచ్చిందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదివారం భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర అవతరణ పురస్కరించుకొని జాతీయ జెండా ఎగురవేశారు అనంతరం స్థానిక రైతు బజార్ వద్ద ఉన్న అమరవీరుల మారక స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్ష నెరవేరింది అన్నారు ఆకాంక్ష వేరకు దశాబ్ద కాలంలో ప్రజలు ఆకాంక్ష మేరకు అభివృద్ధి జరగలేదన్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం పనిచేస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెంది దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ సభ్యులు తంగళ్ళపల్లి రవికుమార్,  మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు , నాయకులు కే. సోమయ్య, కొండల్ రెడ్డి, శ్రవణ్ పాల్గొన్నారు.
Spread the love