Monday, June 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపేదల పక్షాన పోరాడేది ఎర్రజెండానే

పేదల పక్షాన పోరాడేది ఎర్రజెండానే

- Advertisement -

దేశంలో అమ్మకానికి ప్రజాస్వామ్యం
ఒక్కో ఎంపీని 50 కోట్లతో కొనుగోలు
మరో ప్రపంచం… పదండి ముందుకు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి, 
ఎంపీ శివదాసన్

నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
‘ పేదల పక్షాన పోరాడేది ఎర్ర జెండానే. శ్రీశ్రీ చెప్పినట్టు మరో ప్రపంచం మరో ప్రపంచం… మరో ప్రపంచం పిలుస్తోంది.. పదండి ముందుకు…’ అని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం, ఉపాధ్యక్షులు రాజ్యసభ సభ్యులు శివదాసన్ పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ లోని అచ్యుతానందన్, సునీత్ చోప్రా ప్రాంగణంలో జరుగుతున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల్లో ఆదివారం ఆయన మాట్లాడారు. పీడితులపక్షాన గొంతెత్తి పోరాడుతున్న, మాట్లాడుతున్న వారిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా జైలుకు పంపుతున్నదని విమర్శించారు. పేదల పక్షాన మాట్లాడుతున్న న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రభీర్‌ పురకాయస్థను అదేవిధంగా జైలు పాలు చేసిందని వివరించారు. ఎన్డీఏ సర్కారు పార్లమెంట్లో తన బలాన్ని పెంచుకునేందుకు ఎంపీల కొనుగోళ్ల పర్వానికి తెరలేపిందని విమర్శించారు. బెంగాల్లో, మహారాష్ట్రలో ఒక్కొక్క ఎంపీకి 50 కోట్లు ఇచ్చి పార్టీలు మారేలా ప్రోత్సహించడం, అడ్వాన్సుగా ఒక్కొక్కరికి నాలుగు కోట్లు ఇవ్వడం అంటేనే ప్రజాస్వామ్యాన్ని అమ్మకానికి పెట్టటమని దుయ్యబట్టారు. ఈసీ కూడా బీజేపీ కోసమే పనిచేస్తున్నదని విమర్శించారు. పార్లమెంట్లో పలు బిల్లులను ఎలాంటి చర్చ లేకుండానే మోడీ సర్కారు ఆమోదించుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కార్పోరేట్ శక్తుల కోసమే బీజేపీ లేబర్ కోడ్లను తీసుకొస్తున్నదని విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో గవర్నర్ లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నదని ఎత్తి చూపారు. దేశ రాజకీయాలు ఇలా ఉండగా పేదల పక్షాన పార్లమెంట్లో, వెలుపలా పోరాడుతున్నది ఎర్రజెండా మాత్రమే అని స్పష్టం చేశారు. ఆశాలు, అంగన్‌వాడీలు, వ్యవసాయ కార్మికులు, కూలీలు… విడివిడిగా కాకుండా అందరూ ఒకతాటిపైకి వచ్చి సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. తెలుగులో శ్రీ శ్రీ కవితను కోట్ చేస్తూ ‘మరో ప్రపంచం మరో ప్రపంచం పిలుస్తోంది.. పదండి ముందుకు ‘ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -