వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్ తీర్మానం
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రతినిధి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వ్యవసాయ కార్మిక సంఘం గత మహాసభ నుంచి ఇప్పటి మహాసభ వరకు మధ్యకాలంలో మరణించిన మహనీయులకు, వివిధ పోరాటాలు అమరులైన వారికి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభ సంతాపం తెలిపింది. ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్ సంతాప తీర్మానాన్ని చదివి వినిపించారు. సీతారాం ఏచూరి, సునీత్ చోప్రా, కేరళ మాజీ సీఎం అచ్చుతానందన్, బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య, హరిత విప్లవ పితామహుడు ఎమ్మెస్ స్వామినాథన్, కేరళ హోం శాఖ మాజీ మంత్రి కొడేరు బాలకృష్ణ, ఎం శంకరయ్య, వాసుదేవ భట్టాచార్య, కేబీ దత్, సంగయ్య, పెంచలయ్య, సామినేని రామారావు, నూర్జహాన్, ఎర్ర శ్రీకాంత్, రోజా రాణి, లక్ష్మీదేవమ్మ, మహేష్, వేముల మహేందర్, ఇటీవల కాలంలో మరణించిన ప్రజా సంఘాల నాయకులకు, తదితరులకు సంతాపం తెలుపుతున్నట్టు ప్రకటించారు. అమరవీరుల సంతాపం తెలుపుతూ మహాసభ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించింది.
మహనీయులకు, అమరవీరులకు మహాసభ సంతాపం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



