
చలో హైదరాబాదు కు వెళ్లకుండా ముందస్తుగా ఆక్రమంగా పోలీసులచే ప్రభుత్వం అరెస్టు చేయించడం అన్యాయమని సిపిఎం మండల కార్యదర్శి ఈసంపల్లి సైదులు ఆరోపించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ శాంతియుతంగా చలో హైదరాబాదు కార్యక్రమానికి వెళ్లి సిఐటియు భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించుకునేందుకు వెళదాము అనుకునే క్రమంలో పోలీసులు శుక్రవారం ఉదయం ఊళ్లోకి వచ్చి ఆక్రమంగా నన్ను అరెస్టు చేయడం సరైంది కాదని అన్నారు. కార్మిక సమస్యలు శాంతియుత పద్ధతిలో పరిష్కరించుకునే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటే మమ్ములను ముందస్తుగా అరెస్టు చేయడం ఈ ప్రభుత్వానికి ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించుకోవడం ప్రభుత్వానికి ఇష్టం లేదా అని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిపెండ్ చేసినట్టు తెలిపారు.