నవతెలంగాణ – సారంగాపూర్: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమకి సారంగాపూర్ మండలంలోని స్వర్ణ గ్రామంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నియోజకర్గ కో ఆర్డినేటర్ అఫ్సర్ యూసుఫ్ జహి హాజరై.. మహాత్మా గాంధీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించి మాట్లాడారు.. రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని, మహత్మ గాంధీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ల గురించి వివరించారు వారి సేవలను కొనియాడారు వారు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూపాయనించాలని అన్నారు.ఎఎంసి చైర్మన్ ఆద్వర్యంలో అన్నదానం నిర్వహించారు. అలాగే మండలంలోని ఆయా గ్రామాల్లో అంబేద్కర్ సంఘాల ఆద్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాది గారు,మండల అధ్యక్షులు భోల్లోజి నర్సయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పోతారెడ్డి,అహ్మద్ ముక్తార్,ప్రశాంత్, దన్ సింగ్,నాయకులు సింగం బోజగౌడ్, భోజన్న ,రమేష్,లింగారెడ్డి , సత్యం,రాము, లస్మన్న, శెఫిక్ ,సురేందర్, కార్యకర్తలు పాల్గొన్నారు.