విస్తృతంగా కొనసాగుతున్న  జై బాపు, జై బిమ్, జై సంవిధన్..!

నవతెలంగాణ – మల్హర్ రావు
ఏఐసీసీ,టిపిసిసి పిలుపు,రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆదేశాలతో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆధ్వర్యంలో మండల కేంద్రమైన తాడిచెర్లలో బుధవారం జై బాపు, జై భీమ్, జై సoవిదన్ కార్యక్రమం విస్తృతంగా నిర్వహించారు. పురవీధుల గుండా ర్యాలీలు నిర్వహిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యదితులుగా తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య,మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,కాంగ్రెస్ పార్టీ ఎస్సిసెల్ జిల్లా అధ్యక్షుడు దండు రమేష్,జిల్లా ప్రధాన కార్యదర్శి ఐత రాజిరెడ్డి హాజరై మాట్లాడారు స్వాతంత్ర్యo  తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ,స్వాతంత్య్ర సమరయోధులు శాంతియుతంగా ప్రేమే లక్ష్యం సేవే మార్గంగా మహాత్మా గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కనుమరుగు చేస్తున్నటువంటి బిజెపి పార్టీ తప్పిదాలను గ్రామ గ్రామాన గడపగడపకు తెలియజేసేయడమేన్నారు.ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ వైస్ చైర్మన్ మల్కా ప్రకాష్ రావు,కాంగ్రెస్ పార్టీ.తాడిచెర్ల,పెద్దతూండ్ల,అడ్వాలపల్లి గ్రామ శాఖల అద్యకులు కేశారపు చెంద్రయ్య, జక్కుల వెంకట స్వామి యాదవ్, అజ్మీర రాజు నాయక్,యూత్ మండల అధ్యక్షుడు గడ్డం క్రాంతి,డివిజన్ కార్యదర్శి మండల రాహుల్,కాంగ్రెస్ నాయకులు కుంట సది, ఇందారపు చెంద్రయ్య,తిర్రి సమ్మయ్య,మంత్రి రాజా సమ్మయ్య,దుర్గాప్రసాద్, మధు,బూడిద రాజా సమ్మయ్య,పిరయ్య,రవి,సమ్మయ్య పాల్గొన్నారు.
Spread the love