న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండిస్టీస్‌కు చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసు బీమా రంగంలో జాయింట్ వెంచర్ (జేబీ) ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ఇప్పటికే ఈ అంశంపై అలియాంజ్ ఎస్‌ఈతో జట్టు కట్టేందుకు చర్చలు జరుపుతోందని సమాచారం. జర్మనీకి చెందిన అలియాంజ్ భారత్‌లో ఇప్పటికే ఉన్న రెండు సంయుక్త భాగస్వామ్య సంస్థలను రద్దు చేసుకోవాలని భావిస్తోంది. ఈక్రమంలో అలియాంజ్, జియో కలిసి జనరల్ ఇన్స్యూరెన్స్, లైఫ్ ఇన్స్యూరెన్స్ సేవల సంస్థను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నాయని రిపోర్టులు వస్తోన్నాయి.