బహుజన్ పార్టీలో చేరికలు

నవతెలంగాణ- మోపాల్: బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కోఆర్డినేటర్ ఎంపీ రాంజీ గౌతమ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ల సమక్షంలో బహుజన్ సమాజ్ పార్టీలో చేరిన అక్షిత ఫౌండేషన్ ఛైర్మన్ సన్నీ రాపాక. ఈ సందర్భంగా సన్నిరాపాక మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కేవలం బహుజన సమాజ్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఇది పేదల పార్టీ అని పెత్తందారు వ్యవస్థను నిర్మూలించి పేదలకు న్యాయం చేయాలని ఉద్దేశం. ఈ పార్టీ యొక్క గొప్పతనం అని ఆయన తెలిపారు. ఆయనతో పాటు మోపాల్ కు సంబంధించిన వివిధ నాయకులు బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు.

Spread the love