జడ్పీ సమావేశంలో మండల సమస్యలను ఏకరువు పెట్టిన జడ్పీటీసీ…

నవతెలంగాణ-ఏర్గట్ల
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఏర్గట్ల జడ్పీటీసీ గుల్లే రాజేశ్వర్ మండలంలో నెలకొన్న పలు సమస్యలపై ఆయా శాఖల అధికారులకు తన వాణిని వినిపించారు. ప్రధానంగా ఏర్గట్ల మండలంలోని గుమ్మిర్యాల్ గ్రామం నుండి హైదరాబాద్ కు గతంలో ఉదయం 5 గంటలకు బస్ సౌకర్యం ఉండేదని,అర్ధాంతరంగా బస్ సేవలు నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజల సౌకర్యార్థం బస్ ను పునరుద్ధరించాలని ఆర్టీసీ ఆర్.ఎంకు తెలిపారు.ఈ విషయమై ఆర్టీసీ ఆర్.ఎం. స్పందించినట్లు జడ్పీటీసీ తెలిపారు.అలాగే మండలకేంద్రంలో కస్తూర్భా భవనం గతంలో అద్దె భవనంలో కొనసాగిందని,ఈ సంవత్సరం అత్యంత,ఆధునిక హంగులతో పాఠశాల ప్రారంభం అయ్యిందని,స్వంతంగా నూతన భవనం నిర్మించినప్పటికి 6 నుండి 10 వతరగతి వరకు 200 మంది విద్యార్థులకే అనుమతి ఉందని తెలిసిందని, పేద పిల్లలు అందులో చదువుకోవాలని అనుకుంటున్నారని,ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్య అందరికి అందాలని,పేద విద్యార్థుల కోసం ఇంకో 50 మందిని పాఠశాలలో చేర్చుకొని 250 మంది విద్యార్థులకు అనుమతి కల్పించవలసిందిగా డీఈఓను,సబ్ కలెక్టర్ లను కోరానని,వారు సానుకూలంగా స్పందించారని ఆయన అన్నారు.
Spread the love