నవతెలంగాణ-మద్నూర్
రాష్ట్ర మైనారిటీ కమిటీ చైర్మన్ గా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నియమితులయ్యారు. ఈ క్రమంలో బుధవారం ఎమ్మెల్యేను హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో డోంగ్లీ మండల కాంగ్రెస్ నాయకులు కలిసి హృదయ పూర్వక అభినందనలు తెలిపి, ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధికి, ప్రజాసేవకు పాటుపడుతున్న మీ పనితీరును, మీ కష్టాన్ని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మీరు చేసే సేవలను పార్టీ హైకమాండ్ గుర్తించిందన్నారు. దీంతో మీకు మరిన్ని బాధ్యతలు పెరిగాయని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు యూనుస్ పటేల్, ఆ మండల పార్టీ మాజీ అధ్యక్షులు రాజు పటేల్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు బాచావార్ లక్ష్మణ్, మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, ధోతి గ్రామ సర్పంచ్ సంగ్రామ్ పటేల్, మో గా గ్రామ సర్పంచ్ హాలే బస్వంత్, మారేపల్లి సర్పంచ్ శ్రీధర్, మల్లాపూర్ సర్పంచ్ అమృత్వార్ శ్రీకాంత్, చిన్న టాక్లీ సర్పంచ్ నక్కేవారు దత్తు, ఆ మండలానికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్ర మైనారిటీ కమిటీ చైర్మన్ గా జుక్కల్ ఎమ్మెల్యే తోట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



