- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
సాంగ్లీ జిల్లా డీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో భాగంగా జిల్లా కాంగ్రెస్ వ్యవహారాలపై సమగ్ర అవగాహన కోసం ఏఐసీసీ నియమించిన పరిశీలకులు, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను నేరుగా కలుసుకొని వారి అభిప్రాయాలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నారు. జిల్లాలో పార్టీ కార్యకలాపాలు , శక్తివంతమైన నాయకత్వం ఏర్పాటుపై విశ్లేషణ జరిగింది. ప్రతీ నియోజకవర్గంలోని పార్టీ బలోపేతం , నాయకుల మధ్య సమన్వయం, యువ నాయకత్వానికి ప్రాధాన్యత వంటి అంశాలపై తోట లక్ష్మీ కాంతారావు విపులంగా చర్చించారు.
- Advertisement -



