నవతెలంగాణ – డిచ్ పల్లి
సుప్రీంకోర్టు తీర్పునకు సంతోషంతో మాదిగ కులస్తులకు న్యాయం జరుగుతుందని గత 30ఏళ్ళుగా పోరాట ఫలితంగా తీర్పు వచ్చిందని పలువురు పేర్కొన్నారు. శుక్రవారం డిచ్ పల్లి మండలంలోని ధర్మారం బి గ్రామంలో మందకృష్ణ మాదిగ కు పాలాభిషేకం నిర్వహించారు అనంతరం పలువురు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పునకు సంతోషంతో మాదిగ కులస్తులకు న్యాయం జరుగుతుందని గత 30ఏళ్ళుగా మందకృష్ణ మాదిగ పోరాటం ఫలితంగా తీర్పు వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రిజర్వేషన్ అమలు చేయాలని వారు కోరారు . కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా ఉందని, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరగా దీని అమలు చేయాలన్నారు. చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారని, మళ్లీ ఆంధ్రప్రదేశ్లో వారి ప్రభుత్వమే ఉందని అక్కడ తొందరగా అమలు చేయాలని, తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని మాట ఇచ్చిందని దీని అమలుచేసి మాదిగలకు న్యాయం చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమం లో దళితులు పాల్గొన్నారు.