Thursday, August 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‘22-ఏ’ బాధితులకు న్యాయం చేయాలి

‘22-ఏ’ బాధితులకు న్యాయం చేయాలి

- Advertisement -

సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతా : కూకట్‌‌పల్లి ఎమ్మెల్యే 
మాధవరం కృష్ణారావు
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ

​ ప్రజల ఆస్తులను 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చిన ప్రభుత్వం.. తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని బాధి తులకు న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. హెద రాబాద్‌ కేపీహెచ్‌బీ డివిజన్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ఏ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో 22ఏ భూముల సమస్యపై బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కేసీఆర్‌ నాయకత్వంలో ప్రజలకు తాగునీరు, విద్యుత్‌, రహదారులు, పార్కులు, మౌలిక వసతులు, ప్రజా రవాణా వంటి అనేక సదుపాయాలు కల్పించామని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టకుండా ప్రజల భూములపై దృష్టి సారిస్తోందని ఆరోపించారు. హౌసింగ్‌ బోర్డు, టీజీఐఐసీ భూములు ఎక్కడ కనిపించినా అమ్మకానికి పెట్టడమే విధానంగా మారిందన్నారు. బీఆర్‌ఎస్‌ పదేండ్ల పాలనలో హౌసింగ్‌ బోర్డుకు చెందిన ఒక్క గజం భూమిని కూడా అమ్మలేదని, కానీ రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు రూ.30 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను విక్రయించారని తెలిపారు. అన్ని ఆధారాలూ, హక్కు పత్రాలూ ఉన్న భూములను నిషేధిత జాబితాలో చేర్చడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే 22ఏ జాబితాను పునఃపరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.
కూకట్‌‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. అవసరమైతే ప్రజల కోసం తాను ఆమరణ నిరాహార దీక్షకు కూడా సిద్ధమని హెచ్చరించారు. లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలకు అండగా ఉండాలి కానీ గుదిబండగా మారకూడదన్నారు. అన్ని ఆధారాలూ ఉన్న భూములను 22ఏ జాబితాలో ఎలా చేర్చుతారని ప్రశ్నించారు. అధికారులు సమస్యను పట్టించుకోనట్లు వ్యవహరించడం దారుణమన్నారు. ఈ సమావేశంలో రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్లు మందడి శ్రీనివాసరావు, సభిహా గౌసుద్దీన్‌, పగడాల శిరీషా బాబురావు, ముద్దం నరసింహ యాదవ్‌, పండాల సతీష్‌ గౌడ్‌, తూము శ్రావణ్‌కుమార్‌, జూపల్లి సత్యనారాయణ, మాధవరం రంగారావు, శేరిలింగంపల్లి నాయకులు, కాలనీ అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -