ఘనంగా కా.జార్జిరెడ్డి వర్థంతి వేడుకలు

నవతెలంగాణ – మల్హర్ రావు
కామ్రేడ్ జార్జిరెడ్డి విప్లవ స్ఫూర్తితో యువత ఉద్యమాలలోకి రావాలని యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం కాటారం మండల కేంద్రంలో కా.జార్జిరెడ్డి (ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు) వర్ధంతి వేడుకలు భారత ఐక్య యువజన సమాఖ్య (యువైఏప్ఐ) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా  రాష్ట్ర అధ్యక్షులు కా.అక్కల బాపు యాదవ్ కా.జా ర్జిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో యువైఏప్ఐ నాయకులు కా.మంతెన రాజశేఖర్,కల్వల సమ్మయ్య,కళ్లెం రమేష్ ,రవీందర్ పాల్గొన్నారు.
యువత మత్తుపదార్దాలకు దూరంగా ఉండాలి
యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ విలువైన జీవితాలు కోల్పోతున్నారని,అలాంటి మత్తుపదార్దాలకు దూరంగా ఉండాలని కా.అక్కల బాపు యాదవ్ పిలుపునిచ్చారు. దేశంలో నిరుద్యోగం పెరిగి కుల, మత, ప్రాంతీయ పార్టీల ఉద్యమాలకు ఆకర్షితులై నిజమైన విప్లవ ప్రజా పోరాటాలను నీరుగార్చుతున్నారన్నారు. కా.జార్జి రెడ్డి చూపిన విప్లవ ఆలోచనలతో భగత్ సింగ్, చేగువేరా, అల్లూరి సీతారామరాజు,కొమరం భీం, కా.పొలం గోపాల్ రెడ్డి విప్లవ స్ఫూర్తి తో భారత ఐక్య యువజన సమాఖ్య. యువైఏప్ఐ యువతి,యువకులను సంఘటితం చేస్తూ ముందుకు వెళుతుందన్నారు.
Spread the love