గ్రానైట్‌ క్వారీలతో కాలరాత్రులు కొండలు, కొలనులు, జీవనోపాధికి ప్రమాదం

గ్రానైట్‌ క్వారీలతో కాలరాత్రులు కొండలు, కొలనులు, జీవనోపాధికి ప్రమాదం– తమిళనాడులో మధురై ప్రజల ఇబ్బందులు
చెన్నై: తమిళనాడులోని మధురై లో గ్రానైట్‌ క్వారీలో అక్కడి ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. క్వారీల యజమానులు లాభార్జనే ధ్యేయంగా పని చేయటం, నియమ నిబంధనలను గాలికొదిలేయటం, అధికారుల పర్యవేక్షణ లోపించటం వంటి కారణాలు అక్కడి ప్రజలను ఆందోళనల్లోకి నెట్టివేస్తున్నాయి. ”కొలనులు, బోరుబావులు ఎక్కువగా కలుషితం కావటంతో చాలా మంది గ్రామస్తులు కిడ్నీ వ్యాధితో బాధపడు తున్నారు. గ్రానైట్‌ క్వారీలు మూత పడిన తర్వాత క్రమంగా మరణాలు తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ, వ్యవసాయం ఇప్పటికీ దాదాపు అసాధ్యం. దీంతో చాలా మంది ఆ గ్రామాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది” అని గ్రామస్థులు కొందరు తెలిపారు. ఒక దశాబ్దం క్రితం కిడ్నీ వ్యాధితో పి.దురైరాజ్‌ మరణించారు. దీనికి కారణం ఇక్కడి గ్రానైట్‌ క్వారీ తవ్వకాలే. అతని భార్య ఇందిర (40) గ్రానైట్‌ క్వారీలపై ఆందోళన వ్యక్తం చేశారు. ” జీవనోపాధి, ప్రియమైన వ్యక్తి యొక్క నష్టాల బాధ ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తున్నది. అతని మరణం తర్వాత నేను నా మేన కోడలు పుష్పవల్లితో కలిసి 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఒట్ట కోవిల్‌ పట్టి వద్ద నివసించటానికి పాఠశాల కు వెళ్ళే తన ఇద్దరు కుమారులతో సరుగువలయపట్టిలోని తన వివాహ గృహాన్ని విడిచిపెట్టింది” అని తెలి పారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యం లోనే మధురైలోని యాజమాన్య ఇటీవల గ్రానైట్‌ల నిర్వహన కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. మేలూర్‌ తాలూకాలోని సెక్కిపట్టి, అయ్యపట్టి, తిరుచునై రెవెన్యూ గ్రామాలలోని నాలుగు ప్రాంతాల నుంచి బహుళ వర్ణ గ్రానైట్‌లను 20 సంవత్సరాల లీజుకు తీసుకోవటానికి టెండర్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తూ మధురై కలెక్టర్‌ ఎం.ఎస్‌ సంగీత గతేడాది అక్టోబర్‌ 3న నోటిఫికేషన్‌ జారీ చేయటం గమనార్హం. ఇక్కడ జరిగినే మైనింగ్‌ కార్యకలాపాల కారణంగా ఇక్కడి ప్రజలపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు చూపాయనీ, ఇందిర వంటి బాధితులు ఇక్కడ వందల సంఖ్యలో ఉన్నారని స్థానికు లు తెలిపారు. వీటి కారణంగా తాము అనేక కాలరాత్రులను గడుపు తున్నామనీ, ప్రకృతి వనరులతో పాటు తమ జీవనోపాధికీ ఇబ్బంది కలుగుతున్నదని ఇక్కడి ప్రజలు అంటున్నారు. కాబట్టి ఈ విషయాల ను దృష్టిలో ఉంచుకొని ఇక్కడి అధి కార యంత్రాంగా గ్రానైట్‌ క్వారీలను, వాటి తవ్వకాలను నియంత్రించాలని వారు కోరుతున్నారు.

Spread the love